చేతనైతే బహిరంగ చర్చకు రా.. : పవన్‌ కల్యాణ్‌కి మంత్రి సవాల్

చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదవడం తప్పించి పవన్‌కు ఇంకేమీ తెలియదని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు చేతనైతే రైతాంగ సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: December 7, 2019, 5:09 PM IST
చేతనైతే బహిరంగ చర్చకు రా.. : పవన్‌ కల్యాణ్‌కి మంత్రి సవాల్
పవన్ కల్యాణ్ (File Photo)
  • Share this:
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి రైతు సమస్యలపై అవగాహన లేదన్నారు ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదవడం తప్పించి పవన్‌కు ఇంకేమీ తెలియదని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు చేతనైతే రైతాంగ సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై మంత్రి మోపిదేవి శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఉల్లి ధరలు దేశమంతా పెరిగాయని.. ఆ సమస్య కేవలం రాష్ట్రంలోనే లేదని అన్నారు. అయినప్పటికీ రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.25కే అందిస్తున్నామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో రైతులకు ఇచ్చిన ప్రాధాన్యతనే జగన్ సర్కార్ కూడా కొనసాగిస్తోందన్నారు. రైతాంగం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెట్టామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. పవన్ ఇకనైనా అడ్డగోలు విమర్శలు,ఆరోపణలు ఆపి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.
Published by: Srinivas Mittapalli
First published: December 7, 2019, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading