Online Tickets: ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల అమ్మకంపై సోమవారం క్లారిటీ.. సీఎంతో భేటీకి పెద్దలు డుమ్మా..!

సీఎం జగన్ తో భేటీకి టాలీవుడ్ పెద్దల డుమ్మా..!

Andhra Pradesh Government: టాలీవుడ్ - ఏపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ గ్యాప్ కు తోడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకానికి సిద్ధమైంది. దీనిపై అభిప్రాయం తీసుకునేందుకు ప్రభుత్వం సోమ‌వారం సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లను ఆహ్వానించింది వైసీపీ సర్కారు.

 • Share this:
  Andhra government: ఏపీ ప్రభుత్వం (AP Government) - సినిమా పెద్దల మధ్య సమావేశానికి రంగం సిద్ధమైంది. గత కొన్నాళ్ల నుంచి ఏపీ ప్రభుత్వానికి - టాలీవుడ్ మధ్య విబేధాలు పెరుగుతూనే ఉన్నాయి. వకీల్ సాబ్ (Vakeel saab) సినిమా విడుదల తరువాత గ్యాప్ పెరుగుతూ వచ్చింది.  ఆ గ్యాప్ భర్తీ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం - సినిమా పెద్దల మధ్య సోమవారం భేటీ జరగనుంది. అయితే ఈ భేటీకి సీనియర్ల హాజరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. సీఎం జగన్ (CM Jagan) తో భేటీ అయ్యేది ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ముఖ్యంగా ఈ భేటీ తరచూ వాయిదా పడుతుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది.  ఆగస్టు నెలాఖరులోనే ఈ భేటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత ఈ నెల మొదటి వారంలో మీటింగ్ కచ్చితంగా జరుగుతుందని భావించారు.  అయితే ఇప్పుడు సోమవారం ఈ భేటీకి రంగం సిద్ధం చేశారు. అయితే  సీఎం జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీలో ఎవరు పాల్గొంటారు అన్నదానిపై క్లారిటీ లేదు. మొదటి నుంచి సినిమా రంగం నుంచి పెద్దగా భావించే చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna) లాంటి వారు సమావేశానికి హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం కేవలం  సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లను  మాత్రమే  వైసీపీ సర్కారు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  సమావేశానికి ఎవరు హాజరైనా ప్రధాన అజెండా మాత్రం ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలే.  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా థియేట‌ర్లలోని సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేప‌ట్టల‌ని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంపై విమ‌ర్శలు వచ్చాయి. దీనిపై జగన్ ప్రభుత్వం వివ‌ర‌ణ కూడా ఇచ్చింది. ఆన్‌లైన్ టికెట్ల వ‌ల‌న బ్లాక్ మార్కెట్‌ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి ప‌న్ను ఎగ్గోట్టే అంశాల‌ను ఆరిక‌ట్టవచ్చని వివరించారు మంత్రి పేర్ని నాని. సినిమాల‌కు లాభం చేకూరుతుంద‌ని రాష్ట్ర ప్రభుత్వం ప్రక‌టించింది. అసలు ఆన్‌లైన్‌లో అమ్మకాల‌ు చేప‌ట్టాల‌నే ప్రతిపాధన సినిమా ప్రేమికుల నుంచే వచ్చిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. మరి దీనిపై సినీ పెద్దలు మాత్రం ఏ మాట్లడడం లేదు. మరి సీఎం జగన్ తో భేటీ తరువాత అయినా దీనిపైన క్లారిటీ వస్తుందో లేదో చూడాలి..

  ఇదీ చదవండి: ఏపీలో కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పెళ్లిళ్లు.. పండుగలపై నిఘా

  ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకంపై ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యద‌ర్శి నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విధివిధాల ఖ‌రారు చేసే ప‌నిలో భాగంగా ప్రభుత్వం అంద‌రి నుండి అభిప్రాయ‌లు సేక‌రిస్తుంది. అన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకంపై అభిప్రాయం తీసుకునేందుకు ప్రభుత్వం సోమ‌వారం సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లను ఆహ్వానించింది వైసీపీ సర్కారు. సినిమా వ‌ర్గాల నుండి మంత్రి పేర్ని నానితో పాటు ఉన్నతాధికారులు స‌ల‌హాలు తీసుకోనున్నారు. అయితే ఈ సమావేశానికి ఎవరెవరు వెళ్తారు అన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

  ఇదీ చదవండి: శ్రీవారి సేవలో సింగిల్ గా సమంత..? చైతు లేకపోవడంతో అనుమానాలు.. మీడియాపై ఫైర్

  టికెట్లు అమ్మకాల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను త‌యారు చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మగా వ‌చ్చిన‌ సొమ్మును, రియల్ టైంలో వారివారి అకౌంట్‌ల‌కు ట్రాన్సఫర్ చేస్తామని స్పష్టమైన హ‌మీ ఇవ్వనుంది ప్రభుత్వం. APFDC ద్వారానే ఆన్‌లైన్ టిక్కెటింగ్ పోర్టల్‌ను నిర్వహించనున్నట్టు సినీ నిర్మాతలకు వివ‌రించ‌నుంది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వంపై ఈ విషయంలో కాస్త విమర్శలు రావడంతో, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీ తర్వాత ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకంపై స్పష్టత రానుంది.
  First published: