news18-telugu
Updated: January 8, 2020, 12:41 PM IST
మొహన్ బాబు, మోదీ భేటీ వెనుక... జగన్, చిరు రాజకీయాలు
తాజాగా సోమవారం డైలాగ్ కింగ్, సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ వెనుక అనేక రకాల వార్తలు వినిపించాయి. మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం వెళ్లి ప్రధానితో సమావేశం కావడంతో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. మోహన్ బాబు వైసీపీని వదిలి బీజేపీలోకి వెళ్లిపోతున్నారన్న వార్తలు గుప్పు మన్నాయి. అయితే తాజాగా ఈ భేటీ వెనుక ఉన్న మరో రాజకీయ కోణం తెరపైకి వచ్చింది. ఏపీ రాజధాని విషయంలోనే మోహన్ బాబు మోదీతో సమావేశమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరు సలహాతోనే మోహన్ బాబు మోదీని కలిశారని కూడా సమాచారం. చిరంజీవి చెప్పడంతో మోదీ వెళ్లి విశాఖ రాజధానిగా మారడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంగీకారమేనన్న సమాచారం మోదీకి తెలిపేందుకు మంచు మోహన్ బాబు ప్రధాని దగ్గరకు వెళ్లారని తెలుస్తోంది.

మోహన్ బాబుకు ముద్దు పెడుతున్న చిరంజీవి (Twitter/Photos)
ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA) వివాదాల నేపథ్యంలో సిని ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు సమావేశమయ్యారు. ఇదే వేదికపై చిరు, మోహన్ బాబు సైతం కనిపించారు. పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు. అయితే ఈ సమయంలోనే చిరు, మోహన్ బాబు మధ్య ఏపీ రాజధాని విషయంలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ సైతం విశాఖ రాజధానిగా మారితే... అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే... మోదీతో మోహన్ బాబు తన కుటుంబంతో సహా కలిసి విషయం కాస్త ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీ రాజకీయ వర్గాలతో పాటు... టాలీవుడ్లో కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జగన్ రాజధాని ప్రతిపాదనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

మోహన్ బాబు, చిరంజీవి (Twitter/Photo)
Published by:
Sulthana Begum Shaik
First published:
January 7, 2020, 10:02 AM IST