చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నా చేయనున్న మోహన్ బాబు

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు 22న తిరుపతిలో విద్యార్థులతో ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 8:15 PM IST
చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నా చేయనున్న మోహన్ బాబు
మోహన్‌బాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా ధర్నా చేయ‌బోతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ధర్నాకు దిగబోతున్నారు. ఇప్పటికే ఆ మధ్య ఈ విషయంలో ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. మోహన్ బాబు కుమారుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి అయిన విష్ణు కూడా బాహాటంగా విమర్శలు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. 22న తిరుపతిలో విద్యార్థులతో ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నారు. వాస్తవానికి మోహన్ బాబు ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేస్తారని వార్తలు వినిపించాయి. కానీ చేయడం లేదు. ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ధర్నా ఎందుకోసం చేసినా, అది ఎన్నికల ప్రచారం మాదిరిగా ఓటర్ల ఆలోచన మీద ప్రభావం చూపించే అవకాశం మాత్రం వుంది. సహజంగానే మోహన్ బాబు మంచి ప్రసంగాలు చేయగలరు. సూటిగా మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి. దీంతో శుక్రవారం ఆయన పేల్చే మాటల తూటాలు కాస్త గట్టిగానే తగిలే అవకాశం వుంది.
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading