నో హెలికాప్టర్.. కారులోనే మహాబలిపురానికి.. చైనా అధ్యక్షుడు అలా ఎందుకు చేశారు?

Modi Xijinping Meet : అమెరికా అధ్యక్షుడి కారు 'ది బీస్ట్' తరహాలో రూపొందించిన 'హాంగ్‌కి' కారును చైనాలో జిన్‌పింగే మొదట వాడటం మొదలుపెట్టారు. అక్కడి అధికార కమ్యూనిస్టు నేతలు కూడా హాంగ్‌కి కారునే ఉపయోగిస్తారు.

news18-telugu
Updated: October 12, 2019, 8:43 AM IST
నో హెలికాప్టర్.. కారులోనే మహాబలిపురానికి.. చైనా అధ్యక్షుడు అలా ఎందుకు చేశారు?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,భారత ప్రధాని నరేంద్ర మోదీ
news18-telugu
Updated: October 12, 2019, 8:43 AM IST
తమిళనాడులోని మహాబలిపురం వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. సాయం సంధ్యవేళ మహాబలిపురం ఆలయం ప్రాంగణంలో ఇద్దరు కలియదిరుగుతూ ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. కలిసి కొబ్బరి బోండాలు తాగారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఇదిలా ఉంటే,మహాబలిపురం చేరుకోవడానికి మోదీ చెన్నై నుండి హెలికాప్డర్‌లో రాగా.. జిన్‌పింగ్ మాత్రం రోడ్డు మార్గంలో రావడం గమనార్హం. అయితే ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి బలమైన కారణమే ఉంది.చైనా కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాల ప్రకారం.. హెలికాప్టర్లను ఉపయోగించవద్దు. చైనా అధ్యక్షుడు లేదా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది. జీ20 లాంటి కీలక సమావేశాలకు కూడా హెలికాప్టర్లను వినియోగించడం నిషేధం అని చైనా అధికారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే బీజింగ్ నుంచి చెన్నై వరకు విమానంలో వచ్చిన జిన్‌పింగ్.. అక్కడినుండి మహాబలిపురం వరకు 57కి.మీ దూరం హాంగ్‌కి కారులో ప్రయాణించారు. విలాసవంతంగా ఉండే హాంగ్‌కి కారును చైనా కమ్యూనిస్టు నేతలు ఎక్కువగా వాడుతుంటారు.

అమెరికా అధ్యక్షుడి కారు 'ది బీస్ట్' తరహాలో రూపొందించిన 'హాంగ్‌కి' కారును చైనాలో జిన్‌పింగే మొదట వాడటం మొదలుపెట్టారు. అక్కడి అధికార కమ్యూనిస్టు నేతలు కూడా హాంగ్‌కి కారునే ఉపయోగిస్తారు.ఇకపోతే శనివారం మధ్యాహ్నం కూడా మోదీ,జిన్‌పింగ్ మహాబలిపురం వేదికగా మరోసారి సమావేశం కానున్నారు. దాదాపు ఆరు గంటల పాటు వీరిద్దరి మధ్య ఇష్టాగోష్టి సమావేశం జరగనుంది. ప్రత్యేక ఎజెండా ఏమీ లేకుండా.. అధికారిక ఆడంబరాలకు దూరంగా.. పూర్తి స్థాయి నిరాడంబర వాతావరణంలో వీరి భేటీ జరగనుంది. శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం భారత్,చైనా అధికారిక ప్రకటనలు చేస్తాయి.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...