మహారాష్ట్ర,హర్యానా ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు..

ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ,శివసేన 136 స్థానాల్లో గెలుపొందాయి. మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక హర్యానాలో బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

news18-telugu
Updated: October 24, 2019, 8:33 PM IST
మహారాష్ట్ర,హర్యానా ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు..
నరేంద్ర మోదీ(File Photo)
  • Share this:
మహారాష్ట్ర,హర్యానాలలో బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టినందుకు ప్రధాని మోదీ అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.దీపావళికి ముందుగానే ప్రజలు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో వరుసగా రెండు దఫాలు గెలవడం కష్టమని.. ఈ గెలుపు తమ సీఎంలు ఫడ్నవీస్,మనోహర్ లాల్ కట్టర్‌ల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. బీజేపీ-శివసేన ఐదేళ్లలో సుస్థిర పాలన అందించాయన్నారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మరిన్ని అభివృద్ది పథకాలు చేపడుతామన్నారు. బీజేపీ గెలుపుకు కృషి చేసి ప్రతీ
ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.ఇదిలా ఉంటే, ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ,శివసేన 136 స్థానాల్లో గెలుపొందాయి. మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక హర్యానాలో బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కొత్త పార్టీ జననాయక్ జనతాదళ్ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశం ఉంది.


Published by: Srinivas Mittapalli
First published: October 24, 2019, 8:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading