ఏపీ, తమిళనాడుకు దక్కని బెర్త్‌లు.. యూపీకి అగ్రతాంబూలం, గుజరాత్‌కు ఎన్నంటే..

నరేంద్ర మోదీ కేబినెట్‌లో యూపీకి అగ్రతాంబూలం దక్కింది. ఆ తర్వాత మహారాష్ట్రకు పెద్దపీట వేశారు. ఏపీ, తమిళనాడుకు ఒక్క పదవికూడా దక్కలేదు.

news18-telugu
Updated: May 30, 2019, 9:33 PM IST
ఏపీ, తమిళనాడుకు దక్కని బెర్త్‌లు.. యూపీకి అగ్రతాంబూలం, గుజరాత్‌కు ఎన్నంటే..
ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం సతకం చేస్తున్న మోదీ
  • Share this:
‘నరేందర్ దామోదర్ దాస్ మోదీ అనే నేను’ అంటూ.. భారతదేశ ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో అంగరంగ వైభవంగా వేడుక సాగింది. ప్రధానితో పాటు మొత్తం 58 మంది కేంద్ర కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో 25 మంది కేంద్రమంత్రులు, 9 మంది స్వతంత్ర హోదాతో కేంద్ర సహాయమంత్రులు. 24 మంది కేంద్ర సహాయమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు అగ్రతాంబూలం దక్కింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చోటు దక్కలేదు. ఈ రెండు రాష్ట్రాల నుంచి బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు మూడు మంత్రిపదవులు దక్కాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఒక్కరికే పదవి వరించింది. మొత్తం 58 మంత్రి పదవుల్లో బీజేపీకి 54 దక్కాయి. శిరోమణి అకాలీ దళ్‌కు 1, ఎల్జేపీకి 1, శివసేన 1, ఆర్పీఐ (ఏ) పార్టీకి 1 మంత్రి పదవి దక్కింది. లోక్‌సభ నుంచి 45 మంది సభ్యులు కేబినెట్ బెర్త్ దక్కించుకోగా, రాజ్యసభ నుంచి 13 మందికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది.

ఏయే రాష్ట్రం వారికి ఎన్ని పదవులు వచ్చాయి?

అరుణాచల్ ప్రదేశ్ : 1

అస్సాం: 1


బీహార్: 6
ఛత్తీస్‌గఢ్: 1
ఢిల్లీ: 1గోవా: 1
గుజరాత్: 3
హర్యానా: 3
హిమాచల్ ప్రదేశ్: 1
జమ్మూకాశ్మీర్: 1
జార్ఖండ్: 2
కర్ణాటక: 4
మధ్యప్రదేశ్: 5
మహారాష్ట్ర: 8
ఒడిశా: 1
పంజాబ్: 2
రాజస్థాన్: 3
తెలంగాణ: 1
ఉత్తరప్రదేశ్: 9
ఉత్తరాఖండ్: 1
పశ్చిమ బెంగాల్: 2
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు