హోమ్ /వార్తలు /National రాజకీయం /

ఎన్నికల తర్వాత జగన్, కేసీఆర్‌లతో పొత్తు పెట్టుకుంటారా..? మోదీ సమాధానమేంటో తెలుసా?

ఎన్నికల తర్వాత జగన్, కేసీఆర్‌లతో పొత్తు పెట్టుకుంటారా..? మోదీ సమాధానమేంటో తెలుసా?

Modi Reaction on Post-Poll Alliance with KCR & Jagan : జగన్, కేసీఆర్‌లతో పొత్తులపై మోదీ పరోక్ష సమాధానం ఇచ్చారనే చెప్పాలి. ఓవైపు సొంతంగా అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూనే.. అవసరమైతే ఒక్క ఎంపీని అందించే పార్టీ సహకారాన్నైనా తీసుకుంటాం చెప్పారు.

ఇంకా చదవండి ...

  భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. ఎన్నికల తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

  బీజేపీ పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాం. ఎన్డీయే కూటమి మా సంఖ్య పెరగడానికి అదనపు బలంగా ఉంటుంది. అవసరమైన సీట్ల కంటే ఎక్కువ సీట్లనే కైవసం చేసుకోబోతున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు మాకు ఇంకొకరి అవసరం ఏర్పడదు. కేవలం ప్రభుత్వాన్ని నడపాలన్నది మా ఉద్దేశం కాదు.. యావత్ దేశాన్ని ముందుకు నడిపించాలన్నది మా లక్ష్యం. ఇందుకోసం అవసరమైతే ఒక్క ఎంపీ సీటు ఉన్న పార్టీ సహకారాన్ని అయినా తీసుకుంటాం. పార్టీలు మమ్మల్ని ఎంతగా వ్యతిరేకించినా.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరిని కలుపుకు వెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం.
  ప్రధాని నరేంద్ర మోదీ

  జగన్, కేసీఆర్‌లతో పొత్తులపై మోదీ పరోక్ష సమాధానం ఇచ్చారనే చెప్పాలి. ఓవైపు సొంతంగా అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూనే.. అవసరమైతే ఒక్క ఎంపీని అందించే పార్టీ సహకారాన్నైనా తీసుకుంటాం చెప్పారు. ఈ లెక్కన ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీకి పూర్తి అధికారం రాకపోతే.. ఇతర పార్టీలతో పొత్తుకు మోదీ తలుపులు తెరిచే ఉంచారని అనుకోవాలి.

  First published:

  Tags: Amit Shah, Bjp, CM KCR, Lok Sabha Election 2019, Narendra modi, Uttar Pradesh Lok Sabha Elections 2019, Ys jagan, Ys jagan mohan reddy

  ఉత్తమ కథలు