ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఏపీలో హోర్గింగ్స్ వెలిశాయి. ఆదివారం (10వ తేదీ) నరేంద్ర మోదీ గుంటూరులో జరిగే సభలో పాల్గొంటారు. ఈ సభను టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో మోదీ పర్యటించే రోజును బ్లాక్ డేగా ప్రకటించింది టీడీపీ. మోదీ పర్యటననకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో నరేంద్ర మోదీకి రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి ‘మోదీ నో ఎంట్రీ’ అంటూ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు.
నరేంద్ర మోదీ తల దించుకుని ఉన్నట్టుగా ఈ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరికొన్ని హోర్డింగ్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందులో ‘మోదీ నెవర్ ఎగైన్’ అంటూ మరో హోర్డింగ్ కూడా కనిపించింది. ఇందులో హ్యాష్ ట్యాగ్స్ కూడా ఏర్పాటు చేశారు. #NoMoreModi, #Modiisamistake అంటూ హ్యాష్ ట్యాగ్స్‌తో హోర్డింగ్ నెలకొల్పారు.
రాష్ట్రంలో ప్రజలు ఉన్నారా? చనిపోయారా అని తెలుసుకోవడానికి మోదీ వస్తున్నారా? అంటూ ఇటీవల చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ సహా చాలా హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే పూర్తిగా నిధులిస్తుందని బీజేపీ చెబుతోంది.
మోదీ టూర్‌ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో వచ్చిన నరేంద్ర మోదీ ఓ కుండలో మట్టి, నీరు ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా ఇప్పుడు టీడీపీ నేతలు ఖాళీ కుండలను పగలగొట్టి నిరసన తెలుపుతున్నారు. దీంతోపాటు వామపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. మోదీ గో బ్యాక్ అంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మోదీ వస్తే భయమెందుకు?: టీడీపీకి బీజేపీ ప్రశ్న
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, AP Special Status, Bjp, Chandrababu naidu, Kadapa steel factory, Pm modi, Tdp