Home /News /politics /

MODI IS RIGHT SOME RADAR CANT SEE THROUGH CLOUDS RAWAT ON PMS BALAKOT REMARK NK

రాడార్లపై మోదీ చెప్పింది... అప్పుడు రాంగ్... ఇప్పుడు రైట్...

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

Narendra Modi : అధికారం ఎవరి చేతిలో ఉంటే, వారు ఏం చెప్పినా చెల్లుతుందా? రాడార్లపై నరేంద్ర మోదీ చెప్పింది ఎన్నికలకు ముందు తప్పైతే, ఇప్పుడు ఎందుకు రైట్ అవుతుంది?

మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఇదే మే నెల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో బాలాకోట్ దాడులపై మాట్లాడారు. బాలాకోట్ దాడులు... మబ్బులు ఉన్నప్పుడే జరపాలనీ, అప్పుడు భారత విమానాలను పాకిస్థాన్ రాడార్లు గుర్తించలేవని తాను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెప్పినట్లు ప్రధాని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఇదో కామెడీ అంశం అయిపోయింది. రాడార్లు మబ్బులున్నా విమానాల్ని గుర్తించగలవన్న విషయం మోదీకి తెలియదా అని చాలా పార్టీలు విమర్శించాయి. కాంగ్రెస్ అయితే... ప్రజల రాడార్‌కు ప్రధాని దొరికిపోయారని సెటైర్లు వేసింది. అప్పట్లో రాంమాధవ్ లాంటి కొందరు బీజేపీ నేతలు మోదీ వ్యాఖ్యల్ని సమర్థించారు. ఇలా క్లౌడ్ రాడార్ అంశం ఎన్నికల ప్రచారాన్ని కుదిపేసింది. ఐతే... చాలా అంశాలు బీజేపీ విజయంతో తుడిచిపెట్టుకుపోయినట్లే... ఈ అంశం కూడా యూ టర్న్ తీసుకుంటోంది. మోదీ చెప్పింది రైట్ అనే పరిస్థితి వస్తోంది.

రాడార్లపై మోదీ వ్యాఖ్యల్ని సమర్థించారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. కొన్ని రకాల రాడార్లు మేఘాల అవతల ఉన్న వాటిని గుర్తించలేవని అన్నారు. కొన్ని టెక్నాలజీలతో పనిచేసే రాడార్లు మబ్బుల అవతల ఏముందో గుర్తించగలవని, మరికొన్నింటికి ఆ సామర్ధ్యం ఉండదు అని ఆయన చెప్పారు. ఇదే విషయంపై మోదీ వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం ఆర్మీ చీఫ్ సమర్థించలేదు. తీరా మోదీ మళ్లీ ప్రధాని అయ్యేసరికి ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారన్న భావన ప్రజల్లో కలుగుతోంది.

 

ఇవి కూడా చదవండి :

టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....

నేడు తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల... ఇలా తెలుసుకోండి...

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?
First published:

Tags: Lok Sabha Election 2019, Narendra modi, National News

తదుపరి వార్తలు