మోదీ ఉంటే సాధ్యమే.. రాహుల్ గాంధీ

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్స్ ఆధానంగా చేసుకుని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: August 12, 2020, 2:27 PM IST
మోదీ ఉంటే సాధ్యమే.. రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ
  • Share this:
‘మోదీ ఉంటే సాధ్యమే.’ 2019 ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల నినాదంలో ఇది కూడా ఒకటి. మోదీ ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారనే భావం వచ్చేలా కమలదళం ఈ ఆన్ లైన్ క్యాంపెయిన్ భారీ ఎత్తున నిర్వహించింది. అలాంటి బీజేపీ స్లోగన్‌తోనే ప్రధాని మోదీపై సెటైర్ వేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి చేసిన కామెంట్స్‌ను ఆసరాగా చేసుకుని మోదీ మీద ఈ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. దేశ జీడీపీ పడిపోతోంది. 5 శాతం వరకు పడిపోవచ్చని భావిస్తున్నారు. అంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జీడీపీ ఇలా దిగజారిపోవడం ఇదే ప్రథమం అని నారాయణమూర్తి అన్నారు. జీడీపీని గాడిన పెట్టేందుకు దేశంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేలా ఓ కార్యాచరణ చేపట్టాలని మూర్తి సూచించారు.


నారాయణమూర్తి కామెంట్స్ ఆధానంగా చేసుకుని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన న్యాయ్ పథకాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో గ్రామీణ, పట్టణ పేదల చేతికి డబ్బు అందించడం ద్వారా వారికి లబ్ధి జరుగుతుందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 12, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading