ఏపీ, తెలంగాణకు కొత్త గవర్నర్లు... త్వరలోనే మార్పు

ముందుగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది. కొత్త గ‌వ‌ర్న‌ర్ గా ఎవ‌రొచ్చేదీ సంకేతాలు కూడా ఏపీ సీఎంకు అందాయి.

news18-telugu
Updated: July 2, 2019, 10:19 AM IST
ఏపీ, తెలంగాణకు కొత్త గవర్నర్లు... త్వరలోనే మార్పు
వైఎస్ జగన్, కేసీఆర్
  • Share this:
తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి హోంశాఖ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. పార్లమెంటు సమావేశాల తర్వాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్ల నియమాకం జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. విజయవాడలో ఇదివరకు ముఖ్యమంత్రి ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని గవర్నర్‌ కార్యాలయంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నందున అందులో గవర్నర్‌ కొలువుతీరే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. దీని పైన ముందుగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది. కొత్త గ‌వ‌ర్న‌ర్ గా ఎవ‌రొచ్చేదీ సంకేతాలు కూడా ఏపీ సీఎంకు అందాయి. దీంతో ..ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌రువాత దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు అధికారికంగా జారీ కానున్నాయి.

విభజన చట్టం ప్రకారం పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇన్నాళ్లు ఒకే గవర్నర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌ 2009 నుంచి కొనసాగుతూ వస్తున్నారు. రెండు రాష్ట్రాలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో గవర్నర్లను వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత గవర్నర్‌ పదేళ్లకు పైగా కొనసాగుతున్నారని, ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు చెబుతున్నారు.

నరసింహన్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేయడమో, జమ్ముకశ్మీర్‌ వ్యవహారాల సలహాదారుగా ఉపయోగించుకోవడమో జరగొచ్చని హోంశాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. న‌ర‌సింహ‌న్‌కు గ‌తంలో కేంద్ర ఇంట‌లిజెన్స్ బ్యూరో లో ప‌ని చేసిన అనుభ‌వం..ప్ర‌స్తుత జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రిస్త‌న్న అజిత్ ధోవ‌ల్‌కు స‌న్నిహితుడిగా ఉండ‌టంతో ఆయ‌న‌కు కేంద్రంలో కీల‌క ప‌ద‌వి వ‌స్తుంద‌ని స‌మాచారం. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌స్తుతం ఉన్న రాజ‌భ‌వన్ య‌ధా త‌ధంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీ నేత‌లు సైతం తెలంగాణ..ఆంధ్రప్రదేశ్‌ నేతలు రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు పలుసార్లు విజ్ఞప్తి చేస్తారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ త్వరలో నిర్ణయం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>