మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్, సోనియా గాంధీ

2014లో మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించారు. ఈసారి మాత్రం BIMSTEC దేశాధినేతలను ఆహ్వానం పంపారు.

news18-telugu
Updated: May 29, 2019, 9:19 PM IST
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్, సోనియా గాంధీ
రాహుల్ గాంధీ, సోనియాగాంధీ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 29, 2019, 9:19 PM IST
గురువారం ఢిల్లీలో జరగబోయే మోదీ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ, ఆయన తల్లి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతిభవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి బిమ్‌స్టెక్ దేశాధినేతలు హాజరుకానున్నారు. 2014లో మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించారు. ఈసారి మాత్రం BIMSTEC దేశాధినేతలను ఆహ్వానం పంపారు.

BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటీవ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కార్పొరేషన్. బంగాళాఖాతం తీరంగా ఉన్న దేశాలు మాత్రమే బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి. మారిషస్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాధినేతలకు కూడా భారత్ ఆహ్వానం పంపింది.
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...