మోదీ 2.0 : ప్రధాని ఆదేశించాడు.. మంత్రులు పాటిస్తున్నారు..

పార్లమెంట్ సమావేశాలకు ముందు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులతో మోదీ సమావేశం నిర్వహించారు. ఎంపీలు, కేంద్రమంత్రులు ఉదయం 9.30గంటల వరకు కార్యాలయంలో ఉండాలని ఆదేశించారు.

news18-telugu
Updated: June 19, 2019, 3:17 PM IST
మోదీ 2.0 : ప్రధాని ఆదేశించాడు.. మంత్రులు పాటిస్తున్నారు..
ప్రధాని నరేంద్ర మోదీ
news18-telugu
Updated: June 19, 2019, 3:17 PM IST
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉదయం 9.30గంటలకే పార్లమెంటుకు చేరుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన ఆదేశాలను కేంద్రమంత్రులు పాటిస్తున్నారు. ప్రధాని ఆదేశాలతో సకాలంలో కార్యాలయానికి చేరుకునేందుకు కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన బహిరంగ సభల షెడ్యూల్‌ను మార్చుకున్నారు.ఆయనతో పాటు కేంద్రమంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్దన్ 9.30గంటలకే కార్యాలయానికి చేరుకుంటున్నారు.కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారిలో గజేంద్ర సింగ్ శెఖావత్‌తో పలువురు కేంద్రమంత్రులు ఉదయం 9.30గంటలకే కార్యాలయాలకు చేరుకుంటున్నారు.

కాగా, సాధారణంగా సమావేశాలకు మంత్రులు, ఎంపీలు హాజరు కాకపోవడం లేదా ఆలస్యంగా రావడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులతో మోదీ సమావేశం నిర్వహించారు. ఎంపీలు, కేంద్రమంత్రులు ఉదయం 9.30గంటల వరకు కార్యాలయంలో ఉండాలని ఆదేశించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుకు నిర్ణీత సమయానికే చేరుకునేవాడినని గుర్తు చేశారు. మంత్రులు కూడా సమయానికి కార్యాలయానికి వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. మోదీ సూచనతో కేంద్రమంత్రులంతా సమయ పాలనా పాటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...