మోదీ ఏ డ్రెస్ వేసుకుంటారో..? అందరి దృష్టి దానిపైనే..
Modi Cabinet 2.0: రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోదీ.. ఎలాంటి దుస్తులు ధరిస్తారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. 2014లో ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో మోదీ వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది.

ప్రధాని మోదీ (ఫైల్)
- News18 Telugu
- Last Updated: May 30, 2019, 11:53 AM IST
నరేంద్ర మోదీ.. ఒక రాజకీయ నాయకుడు. కాదు.. కాదు.. ఎంతోమంది భారతీయులకు ఫ్యాషన్ ఐకాన్. ఆయన కుర్తా ధరించి, తలపాగా ధరించి నడుచుకుంటూ వస్తుంటే రాజసం ఉట్టిపడుతుంది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మోదీ ధరించే తలపాగా రంగులే తన ఫ్యాషన్‌ను ప్రతిబింబిస్తాయి. ఇక, గతంలో అంతర్జాతీయ మీడియాలైతే మోదీని వేనోళ్ల పొగిడాయి. న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ‘నాయకుడంటే ఇలాంటి దుస్తులే ధరించాలి' అని పేర్కొంది. ఇందులో మోడీ ధరించే కుర్తా గురించి రాశారు. ఇండియన్ ఫ్యాషన్‌ను ప్రతిబింబించే విధంగా ఆయన వస్త్రధారణ ఉందంటూ టైమ్స్ మేగజైన్ పేర్కొంది. ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే ప్రపంచానికి కొత్త ఫ్యాషన్ ఐకాన్ వచ్చారంటూ నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించింది. కాగా, ఇప్పుడు రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోదీ.. ఎలాంటి దుస్తులు ధరిస్తారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. 2014లో ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో మోదీ వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈసారి కూడా మోదీ ప్రత్యేక దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.
2014లో మోదీ క్రీమ్ కలర్ కుర్తా, పైజామా ధరించి వచ్చారు. కుర్తాపైన గోల్డెన్ కలర్ హాఫ్ స్లీవ్ జాకెట్‌తో పాటు అందుకు మ్యాచ్ అయ్యేలా బ్లాక్ కలర్ షూస్ ధరించారు. ఈ తరహా వస్త్రధారణ మోదీకి హుందాతనాన్నిచ్చింది. మరోవైపు మోదీ విదేశీ పర్యటనల సందర్భంలోనూ ప్రత్యేక తరహా దుస్తులను ధరిస్తారు. అయితే, మోదీ ఏ దుస్తులు ధరిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2014లో మోదీ క్రీమ్ కలర్ కుర్తా, పైజామా ధరించి వచ్చారు. కుర్తాపైన గోల్డెన్ కలర్ హాఫ్ స్లీవ్ జాకెట్‌తో పాటు అందుకు మ్యాచ్ అయ్యేలా బ్లాక్ కలర్ షూస్ ధరించారు. ఈ తరహా వస్త్రధారణ మోదీకి హుందాతనాన్నిచ్చింది. మరోవైపు మోదీ విదేశీ పర్యటనల సందర్భంలోనూ ప్రత్యేక తరహా దుస్తులను ధరిస్తారు. అయితే, మోదీ ఏ దుస్తులు ధరిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆ పాప పేరు 'సిటిజెన్షిప్'.. కల నెరవేరుతున్నందుకు..
ఈశాన్య రాష్ట్రాల్లో 5వేల పారా మిలటరీ బలగాల మోహరింపు
పౌరసత్వ సవరణ బిల్లు : ముస్లింలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని 1000 మంది ప్రముఖుల డిమాండ్
కేంద్రానికి కేసీఆర్ ఝలక్... ఆ బిల్లుకు వ్యతిరేకం
రేపే లోక్‌సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు..