Modi Cabinet 2.0: అమిత్ షాకు ఆర్థిక శాఖ.. స్మృతీ ఇరానీకి ఈ శాఖే..?

Modi Cabinet 2.0: అమిత్ షాకు ఆర్థిక శాఖ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆర్థిక రంగంలో భారత్ వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరమని, అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్ షా కేబినెట్లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను అప్పగిస్తే పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయట.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 31, 2019, 11:51 AM IST
Modi Cabinet 2.0: అమిత్ షాకు ఆర్థిక శాఖ.. స్మృతీ ఇరానీకి ఈ శాఖే..?
అమిత్ షా (ఫైల్)
  • Share this:
Modi Cabinet 2.0: యావత్తు దేశం మూడు నెలలుగా ఉత్కంఠకు నిన్నటితో తెరపడింది. మళ్లీ ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిరోహించారు. తనతో పాటు మరో 57 మందితో భారీ స్థాయి కేంద్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయమంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గంలో 20 మంది కొత్తవారు. 35 మంది పాతవారికి చోటు దక్కలేదు. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ వంటి వారు తప్పుకోగా, కేబినెట్లోకి విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి ఎస్.జైశంకర్‌కు అనూహ్యంగా కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. కేబినెట్లో 82 మందికి అవకాశముంది. తొలి విడతలో 57 మందిని తీసుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అమిత్ షాకు మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం. అయితే, ఎవరికి ఏ శాఖలు అప్పగిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ రోజు దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా ఇప్పటికే.. అమిత్ షాకు ఆర్థిక శాఖ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆర్థిక రంగంలో భారత్ వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరమని, అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్ షా కేబినెట్లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను అప్పగిస్తే పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయట. అమిత్ షాకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేసిన అనుభవం ఉందని, ఆర్థిక శాఖపై ఆయనకు పట్టు ఉందని అంటున్నారు. గుజరాత్ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పోరేషన్ చైర్మన్‌గా పని చేశారు. అమిత్ షాకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా అప్పగించనున్నట్లు సమాచారం. రాజ్‌నాథ్‌సింగ్‌కు మళ్లీ హోంశాఖను అప్పగించేందుకే మోదీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రులకు ఈ శాఖల్ని కేటాయించినట్లు తెలుస్తోంది..

నితిన్ గడ్కరీ: రవాణా శాఖ, రహదారులు; షిప్పింగ్ మినిస్ట్రీ; నీటి వనరుల శాఖ, నదుల పరిరక్షణ, గంగా ప్రక్షాళన


సదానంద గౌడ: స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్
నిర్మలా సీతారామన్: రక్షణ శాఖ
రాం విలాస్ పాసవాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్నరేంద్ర సింగ్ తోమర్: పార్లమెంటరీ వ్యవహారాలు; గ్రామీణాభివృద్ధి శాఖ; పంచాయతీ రాజ్ శాఖ
రవిశంకర్ ప్రసాద్: లా అండ్ జస్టిస్; ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
తావర్ చంద్ గెహ్లాట్: సామాజిక న్యాయం, సాధికారత
ఎస్.జైశంకర్: విదేశీ వ్యవహారాలు
రమేశ్ పోక్రియాల్ ‘నిశాంక్’: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
అర్జున్ ముండా: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు
స్మృతీ ఇరానీ: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు