Home /News /politics /

MODERN DAY JINNAH ASSAM CM HIMANTA BISWA SARMA ESCALATES ATTACK ON RAHUL GANDHI PVN

Assam CM : రాహుల్ గాంధీ ఆధునిక జిన్నా..ఆయనలో జిన్నా దెయ్యం ప్రవేశించిందన్న సీఎం

రాహుల్-హిమంత్ బిశ్వ శర్మ(ఫైల్ ఫొటో)

రాహుల్-హిమంత్ బిశ్వ శర్మ(ఫైల్ ఫొటో)

Himanta Biswa Sarma On Rahul : గత పది రోజులుగా రాహుల్‌ గాంధీ చేస్తున్న ప్రసంగాలను తాను గమనిస్తున్నానని హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని ఒకసారి, ఇండియా అంటే గుజరాత్ నుంచి బెంగాల్ దాకా అని ఇంకోసారి

Assam CM On Rahul Gandhi :    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తన మాటల దాడిని మరింత ఉధృతం చేశారు. రాహుల్ ను రాజీవ్ గాంధీ కుమారుడేనా అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా ప్రశ్నించిందా అంటూ శుక్రవారం ఉత్తరాఖండ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వ శర్మ..శనివారం మరోసారి రాహుల్ పై విరుచుకుపడ్డారు. శనివారం గౌహతిలో జరిగిన పార్టీ సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. రాహుల్‌ ను పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాతో పోల్చారు. రాహుల్‌ గాంధీ ఆధునిక జిన్నా అని విమర్శించారు. రాహుల్ గాంధీలోకి జిన్నా దెయ్యం ప్రవేశించిందని అన్నారు. ఆయన భాష,మాటలు 1947కు ముందు జిన్నా మాట్లాడినట్లుగానే ఉందని,రాహుల్ గాంధీ నేటి తరం జిన్నా మాదిరి కనిపిస్తున్నాడని ఆరోపించారు. గత పది రోజులుగా రాహుల్‌ గాంధీ చేస్తున్న ప్రసంగాలను తాను గమనిస్తున్నానని హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని ఒకసారి, ఇండియా అంటే గుజరాత్ నుంచి బెంగాల్ దాకా అని ఇంకోసారి అన్నారని చెప్పారు. అంటే గుజరాత్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు మాత్రమే భారత దేశంగా ఆయనకు అనిపిస్తుందని విమర్శించారు. ఆ విధంగా, రాహుల్‌ గాంధీ ఆధునిక జిన్నా అని వ్యాఖ్యానించారు.

ఇక,రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్‌ గాంధీయేనా, రాహుల్‌ ఆయన కుమారుడేనా అని బీజేపీ ఎప్పుడైనా ప్రశ్నించిందా అంటూ హిమంత బిస్వా శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సహా పలువురు నేతలు దీనిని ఖండించారు. మరోవైపు రాహుల్‌పై విమర్శలను ఖండిస్తూ అసోంలో కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం శర్మ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాహుల్ గాంధీ పుట్టుకపై సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. రాహుల్ ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని, అలాంటి కుటుంబాన్ని ఇంత నీచంగా తిడతారా? అంటూ బీజేపీపై కేసీఆర్ ఫైరయ్యారు. రాహుల్‌గాంధీ కుటుంబం దేశం కోసం అమరులయ్యారు.. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇంత కుసంస్కారంగా మాట్లాడుతారా? అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

ALSO READ CM KCR: నా కన్నీళ్లు ఆగలేదు.. Rahul Gandhi పుట్టుకపై ఇంత నీచమా? -ఆ సీఎం బర్తరఫ్‌కు డిమాండ

అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వ శర్మ వివరణ ఇచ్చుకున్నారు. రాహుల్‌ తండ్రి గురించి ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో శర్మ వివరించారు. మన సైనికులు నెల రోజుల ముందుగానే శత్రుదేశ భూభాగంలోకి వెళ్లి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించుకుంటారని, అవన్నీ వ్యూహాత్మకమని, ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారని తెలిపారు. మళ్లీ కొందరు పదేపదే ఆ ఆపరేషన్‌కు ఆధారాలు కావాలని అడిగితే మన సైనికులకు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. అందువల్లే రాహుల్‌ పై తాను అలా వ్యాఖ్యానించాల్సి వచ్చిందన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Assam, Congress, Rahul Gandhi

తదుపరి వార్తలు