Home /News /politics /

MLC ELECTIONS RESULTS TO BE OUT TODAY TENSE IN KARIMNAGAR AS TRS AND REBELS CONFIDENT OF WINNING MKS KNR

cm kcrకు వెన్నుపోటు పొడిచారా? సర్దార్ గెలవబోతున్నాడా? -karimnagar mlc resultsపై ఉత్కంఠ

సీఎం కేసీఆర్ తో సర్దార్ రవీందర్ సింగ్(పాత ఫొటో)

సీఎం కేసీఆర్ తో సర్దార్ రవీందర్ సింగ్(పాత ఫొటో)

ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఫలితాలు వెలువడనుండగా, కరీంనగర్ జిల్లాలో టెన్షన్ పీక్ స్థాయికి చేరింది. సీఎం కేసీఆర్ పై ప్రతీకారం కోసం రగిలిపోతోన్న మాజీ నేతలు, తాజా రెబల్స్ గెలుపు తమదేనని దీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ క్యాంపుల నుంచి వచ్చి నమ్మకంతో ఓటేశారా , వెన్నుపోటు పొడిచారా నేడు తేలుతుంది .

ఇంకా చదవండి ...
    (P.Srinivas,News18,Karimnagar)
    తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మొత్తం 12 స్థానాలకుగానూ ఆరింటిని అధికార టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన ఆరు స్థానాలకు ఈనెల 10న పోలింగ్ జరిగింది. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపును మంగళవారం చేపట్టారు. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఫలితాలు వెలువడనుండగా, కరీంనగర్ జిల్లాలో టెన్షన్ పీక్ స్థాయికి చేరింది. సీఎం కేసీఆర్ పై ప్రతీకారం కోసం రగిలిపోతోన్న మాజీ నేతలు, తాజా రెబల్స్ గెలుపు తమదేనని దీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎవరెన్ని చేసినా రెండు స్థానాల్లో గులాబీ గుబాళింపు తథ్యమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి వివరాలివి..

    స్థానిక సంస్థల నుంచి శాసనమండలి రెండు స్థానాలకు ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడను న్నాయి . ఈనెల 10 న పోలింగ్ జరగగా కౌంటింగ్ మంగళవారం ఉదయం ఎస్ఆర్ఆర్ డి గ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తారు . కౌంటింగ్ ప్రారంభమైన రెండుగంటల్లోగా ఫలితా లు వెలువడనున్నాయి . మొత్తం ఎనిమిది ప్రాంతాలు కరీంనగర్ , హుజురాబాద్ , పెద్దపల్లి , మంథని , జగిత్యాల , కోరుట్ల , సిరిసిల్ల , హుస్నాబాద్ లో పోలింగ్ నిర్వహించారు . మొత్తం తొమ్మిది టేబు ళ్లు ఏర్పాటు చేసి ఏడు రౌండ్లలో లెక్కింపు నిర్వహిస్తారు . మొత్తం 1324 మంది ఓటర్లకు గాను 1320 మంది ఎంపీటీసీ లు , జడ్పీటీసీలు , కౌన్సిలర్లు , కార్పోరేట ర్లు , ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి - జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ జిల్లాలో మంగళవారం జరుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధి కారి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు .



    మొదటి ప్రాధాన్యత ఓటును మొదట లెక్కిస్తారు . అనంతరం రెండు , మూడు ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉంటుంది . మొదటి ప్రాధాన్య తలో గెలుపుతేలకుంటే రెండో ప్రాధాన్యత లెక్కిస్తారు . రెండు స్థానాలకు గాను పదిమంది పోటీ పడ్డారు . టీఆర్ఎస్ తరపున ఎలగందుల రమణ ( జగిత్యాల ) టీఆర్ఎస్ , తానిపర్తి భాను ప్రసాద్రావు ( పెద్దపల్లి ) , స్వతంత్రు లుగా ఆరే రాజేందర్ ( రాఘవపేట , మల్లాపూర్ మండటం జగిత్యాల జిల్లా ) . ఎనుమల సత్యనారాయణ ( భగత్నగర్ , మంథని , పెద్దపల్లి జిల్లా ) , ఎడ్ల జోజిరెడ్డి ( తిమ్మా పూర్ , కరీంనగర్ జిల్లా ) , కొల్లూరి గంగా ధర్ ( పోతారం , మల్యాల మండటం జగిత్యాల జిల్లా ) . మాసారి రమేశ్ ( భీర్ ప్పూర్ , జగిత్యాల జిల్లా ) , మునిగాల విజయలక్ష్మీ ( భూపాలప ట్నం , చొపదం డి మండలం , కరీంనగర్ జిల్లా ) . సర్దార్ రవీందర్ సింగ్ ( సిక్కు వాడ , కరీంనగర్ ) , సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి ( సైదాపూర్ , కరీంనగర్ జిల్లా ) లు ఉన్నారు . భాను ప్రసాదావు వరుగా రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహి స్తూ వస్తున్నారు.

    ఎల్ రమణ శాసనమం డలికి మొదటి సారి పోటీ పడ్డారు . కాగా, పెద్దల సభకు ప్రతినిధులు ఏ పెద్దలకు ఓటు వేశారో తెలుస్తుంది . మొదటి ప్రాధాన్యతలో 441 వస్తే గెలుపే .. పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డ ఈ ఎన్నికల్లో 1320 మంది ఓటు వేశారు . ఒకే బ్యాలెట్ పై ఇద్దరు అభ్యర్థులను విజేతలుగా ప్రకటించాల్సి ఉంటుంది . ఇందుకోసం మొత్తంగా ఉన్న మూడో " వంతు ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రక టిస్తారు . తొలి ప్రాధాన్యతలో 441 ఓట్లు వస్తే విజేతగా ప్రకటిస్తారు . రెండో అభ్యర్థి విషయలో ఆ తరువాత క్రమంలో వచ్చిన ఓట్ల ఆధారంగా ఫలితం ప్రకటిస్తారు.

    గులాబీ నేతల్లో గెలుపు ధీమా స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు కలిగి ఉన్న అధికార టీఆర్ఎస్ తమ ఇద్దరు అభ్యర్థుల గెలుపు ఖాయమన్న ధీమాలో ఉంది . టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతరులకు 50 ఓట్లు కూడ రావని ప్రక టించారు.స్వతంత్రులతోపాటు ఆయా పార్టీలో ఉన్నవారిలో చాలా మంది తమ అభ్యర్థులకే ఓటు వేస్తారని టీఆర్ఎస్ సమ్మకంతో ఉంది . బలాబలాలు చూసుకుంటే కరీంనగర్ , రామగుండం రెండు కార్పోరేషన్లలలో కలిపి టీఆర్ఎస్ కు 49 మంది , బీజేపీకి 19 , కాంగ్రెస్కు 11 , ఇతరులు 30 మంది ఉన్నారు . ముని సిపాలిటీల్లో టీఆర్ఎస్ కు 246 , కాంగ్రెస్ , బీజేపీలకు 30 చొప్పున బలం ఉంది . ఎంపీటీసీల్లో టీఆర్ఎస్కు 500 వరకు , కాంగ్రెస్ కు 118 , బీజేపీకి 50 వరకు బలం ఉంది . జడ్పీటీసీ సభ్యుల్లో టీఆర్ఎస్ బలం 65 కాగా కాంగ్రెస్కు ఐదుగురు ఉన్నారు . మొత్తంగా వెయ్యి ఓట్లకు పైనే తమకు లభిస్తాయన్న ధీమాలో ఉన్నా రు . స్థానిక పెద్దలు క్యాంపుల నుంచి వచ్చి నమ్మకంతో ఓటేశారా , వెన్నుపోటు పొడిచారా నేడు తేలుతుంది .
    Published by:Madhu Kota
    First published:

    Tags: Karimnagar, Mlc elections, Trs

    తదుపరి వార్తలు