Local mlc : కరీంనగర్‌లో రెబల్స్ బెడద.. క్రాస్‌ ఓటింగ్‌పై టెన్షన్..

ప్రతీకాత్మక చిత్రం

Local mlc : కరీంనగర్‌లో టీఆరెఎస్ కు రెబల్స్ బెడద..యల్.( Mlc elections )రమణకు అధిలోనే హంసపాదు,గెలుపు కత్తిమీద సామే టీఆరెఎస్‌కు..గెలుపుకోసం రంగంలోకి ముఖ్య నాయకులు..

 • Share this:
  కరీంనగర్ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Mlc elections) అధికార పార్టీ నాయకులను అధిక నామినేషన్లే భయం వెంటాడుతుంది. దీంతో పాటు క్రాస్ ఓటింగ్ భయం.. కూడా పట్టుకుంది. ఈ క్రమంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రెండు నియోజక వర్గాలకు సంబంధించి మొత్తం 27 మంది నామినేషన్లు దాఖలు వేయగా.. నామినేషన్ల పరిశీలన అనంతరం ముగ్గురు నామినేషన్లను తిరస్కరించారు .( Mlc elections)మరో 24 మంది బరిలో (karimnagar )ఉన్నారు . ఇందులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా టీ . భానుప్రసాదావు , ఎలగందుల రమణలు,నామినేషన్లు వేశారు . వీరు ఏకగ్రీవం కావాలంటే 22 మంది పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది . నామినేషన్ల ఉపసంహరణకు రేపటికి సమయం ఉంది .

  అయితే విత్ డ్రాలు అంటే ..(withdraw )ఒకరిద్దరు ఉంటే ఏమో అనుకోవచ్చు కాని ఇంతమందిని ఒప్పించడం , మెప్పించడం సాధ్యం కాదని అధికర పార్టీ నేతలంటున్నారు . తెలంగాణలో12 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇంత పెద్ద సంఖ్యలో ఎక్కడ నామినేషన్లు దాఖలు కాలేదు . టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ , టీఆర్ఎస్‌కు చెందిన మరో నాయకుడు సైదాపూర్ ఎంపీపీ , ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు .

  ఇది చదవండి : ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట.. ఫిదా అయిన ఎండీ సజ్జనార్..కానుకగా...


  నామినేషన్లు దాఖలు చేసిన వారిలో చాలా మంది అధికార టీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు . trs వీరిని ఒప్పించి ఉపసంహరించేలా చేయడం ఎమ్మెల్యేలకు , మంత్రులకు కత్తిమీద సామే అని చెప్పాలి . అధికార టీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ ఉన్నప్ప టికీ క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతుంది . స్థానిక సంస్థల నుంచి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న భానుప్రసాద్ రావుపై స్థానిక సంస్థల ప్రతినిధుల్లో అసంతృప్తి ఉంది . ఈ క్రమంలోనే నామినేషన్లు చాలా మంది వేయడానికి కారణమనే చర్చ క్యాంపుల్లో కూడా కొనసాగుతుంది .

  గతరెండు పర్యాయాలు ఏకగ్రీవమైన సందర్భంలో కనీసం ఎమ్మెల్సీ లాడ్స్ నుంచి నిధులు కేటాయించలేదని , కనీసం మమ్ములను పట్టించుకోలేదనే ఫీలింగ్ ఉన్నారు .అలాగే ఉద్యమ కారుడైన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు సిట్టింగ్ స్థానం కాదని నిన్నగాక మొన్న వచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకింత కోపంతో ఉన్నారని కూడా తెలుస్తుంది.

  కాగా పార్టీ అధిష్టానం సూచన మేరకు ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రతినిధులు క్యాంపుల్లో ఉన్నారు . వీరంతా క్రాస్ ఓటింగు పాల్పడుకుండా ఉండాలంటే వీరిని మచ్చిక చేసుకోక తప్పదంటున్నారు. ఈ క్రమంలోనే నామినేషన్ వేసిన తర్వాత పార్టీ ఓటర్లను క్యాంపుకు తరలించినట్టు సమాచారం. నేరుగా క్యాంపు నుండే ఓటింగ్ తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు విత్ డ్రాల మీద దృష్టి సారించారు. అయితే నామినేషన్ వేసిన వారిలో కొంతమంది బరిలో నిలిచేందుకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. దీంతో మరో రోజు గడిస్తే.. గాని ఎవరు బరిలో నిలుస్తారో తేలనుంది. నామినేషన్ వేసిన వారిలో టీఆర్ఎస్‌కు చెందిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌తో పాటు ఎంపీటీలు , ఇతర నేతలు కూడా ఉన్నారు.
  Published by:yveerash yveerash
  First published: