హోమ్ /వార్తలు /politics /

Vallabhanen Vamsi: భువనేశ్వరికి సారీ చెప్పిన వల్లభనేని వంశీ... పొరబాటు జరిగిందని కామెంట్

Vallabhanen Vamsi: భువనేశ్వరికి సారీ చెప్పిన వల్లభనేని వంశీ... పొరబాటు జరిగిందని కామెంట్

వల్లభనేని వంశీ (ఫైల్)

వల్లభనేని వంశీ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuwaneswari) పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (MLA Vallabhaneni Vamsi Mohan) విచారం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuwaneswari) పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (MLA Vallabhaneni Vamsi Mohan) విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. భువనేశ్వరిపై పొరబాటున వ్యాఖ్యలు చేశానన్న వంశీ.. తన వ్యాఖ్యలతో ఎవర్నైనా బాధపెట్టి ఉంటే అందుకు సారీ చెప్తున్నానన్నారు. ఏమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమేనని.. ఆ వ్యాఖ్యలకు బాధపడుతున్నానని వంశీ అన్నారు. తెలుగుదేశం పార్టీలో అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరినే అన్న వంశీ.. ఆమెను అక్కా అని పిలుస్తానని వెల్లడించారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో తాను క్షమాపణ చెప్పడం లేదని.. వ్యక్తిగతంగా బాధపడుతున్నందునే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నట్లు వెల్లడించారు.

  వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ ఇటీవల ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతున్న సందర్భంగా భువనేశ్వరి వ్యక్తిత్వం గురించి వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఇలాంటి కామెంట్సే చేశారంటూ చంద్రబాబు సభను బాయ్ కాట్ చేసి బయటకు వచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియా ముందే వెక్కివెక్కి ఏడ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. నందమూరి కుటుంబం కూడా మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలను ఖండించింది. అటు టీడీపీ శ్రేణులు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.

  ఇది చదవండి: ఏపీలో సినిమా టికెట్ల కొత్త ధరలు ఇవే..! ఏ ప్రాంతంలో ఎంతంటే..!


  ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా మదిరలో జరిగిన కమ్మ కులస్థుల వనసమారాధనలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు.. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును భౌతికంగా తొలగిస్తే రూ.50 లక్షలు ఇస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేగింది. మల్లాది వాసు వ్యాఖ్యలపై ఓ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వంశీ.. భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. ఏమోషన్ లో తప్పుదొర్లిందని.. మరోసారి అలాంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడతానన్న వంశీ.. తన విషయంలోనూ టీడీపీ వాళ్లు అలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. లోకేష్ ఇంటి ఐపీ అడ్రస్ నుంచే తనపై, తన కుటుంబంలోని మహిళలపై అభ్యంతరకరంగా రాయించారని వంశీ ఆరోపించారు. ఆ ఆవేదనతోనే భువనేశ్వరిపై మాట తూలానని వివరణ ఇచ్చారు.

  ఇది చదవండి: ఏపీలో వరదలపై స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ సాయం..


  ఐతే తనను కులం నుంచి వెలివేస్తారనో.. చంపేస్తారన్న భయంతోనే క్షమాపణ చెప్పడం లేదని వంశీ స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేసిన వాళ్లు నిరూపించుకోవాలని కూడా ప్రతి సవాల్ విసిరారు వంశీ. ఉడత ఊపులకు ఎవరూ భయపడలేదని.. వచ్చేవాళ్లు రావొచ్చని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Nara Bhuvaneshwari, Vallabaneni Vamsi

  ఉత్తమ కథలు