పార్టీ నుంచి బహిష్కరించి ఓటు అడుగుతారా..చంద్రబాబుపై వంశీ ఫైర్

చంద్రబాబు, వంశీ

ఏపీలో 4 రాజ్యభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. అధికార పార్టీ వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వ్యాపారవేత్త పరిమళ్ నత్వాని బరిలో ఉన్నారు.

 • Share this:
  టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అసలు ఎందుకు పోటీ చేసిందని విమర్శలు గుప్పించారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేరని తెలిసినా అభ్యర్థిని బరిలోకి దించారని విరుచుకుపడ్డారు. చెంచాలను నమ్ముకుంటే అధోగతి పాలవడం ఖాయమని..చంద్రబాబు ఇప్పటికైనా చెంచాలను పక్కనబెట్టాలని మండిపడ్డారు వంశీ. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత.. తనను ఓటు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్యను పోటీకి దించి దళితులను చంద్రబాబు అవమాన పరిచారని విరుచుకుపడ్డారు వంశీ.

  కాగా, ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తయింది. 175 ఎమ్మెల్యేల్లో 173 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తన ఓటు వేశారు. ఇక టీడీపీకి ఉన్న 23 మందిలో 21 ఓట్లు పడ్డాయి. ఏసీబీ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు,
  హోమ్ క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్ ఓటు వేయలేదు.

  ఏపీలో 4 రాజ్యభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. అధికార పార్టీ వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వ్యాపారవేత్త పరిమళ్ నత్వాని బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేశారు. సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగుకు నాలుగు సీట్లు వైసీపీయే గెలుచుకోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  First published: