Home /News /politics /

MLA ROJA TIES RAKHI TO CM JAGAN ALONG WITH MINISTERS MLAS FOR DISHA ACT SK

సీఎం జగన్‌కు మళ్లీ రాఖీ కట్టిన రోజా.. కారణం ఇదే..

వైసీపీ మహిళా నేతలతో సీఎం జగన్(ఫైల్ ఫోటో)

వైసీపీ మహిళా నేతలతో సీఎం జగన్(ఫైల్ ఫోటో)

ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. ఈ చట్టానికి దిశా అని పేరు పెట్టారు.

    ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌కు ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రాఖీ కట్టారు. రోజాతో పాటు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఇతర మహిళా ఎమ్మెల్యేలు సీఎం రాఖీ కట్టి.. స్వీట్లు తినిపించారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. సాధారణంగా రాఖీ పండగ రోజు రాఖీ కడుతుంటారు. కానీ ఇప్పుడు రాఖీ కట్టడం వెనక మంచి కారణమే ఉంది. అదేంటంటే ఏపీ దిశ చట్టం. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టం తీసుకొచ్చినందుకు ఆయన్ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

    దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమిలన్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. ఈ చట్టానికి దిశా అని పేరు పెట్టారు.

    కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. ఇక మహిళలు, చిన్నారులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: AP disha act, AP News, Cm jagan, RAPE, Rk roja

    తదుపరి వార్తలు