Home /News /politics /

MLA Roja: పది, ఇంటర్ పరీక్షలు రద్దైతే అంతా లోకేష్ లే తాయారవుతారు.. రోజా స్టైల్ సెటైర్లు

MLA Roja: పది, ఇంటర్ పరీక్షలు రద్దైతే అంతా లోకేష్ లే తాయారవుతారు.. రోజా స్టైల్ సెటైర్లు

నారా లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్

నారా లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్

ల్యాంగ్ గ్యాప్ తరువాత ఎమ్మెల్యే రోజా మళ్లీ పంచ్ లు పేలుస్తున్నారు.. జబర్ధస్త్ డైలాగ్ లతో నారా లోకేష్ పై సెటైర్లు వేశారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దైతే.. అంతా లోకేష్ లే తయారవుతారంటూ రోజా విమర్శించారు.

  ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మరోసారి తన నోటికి పని చెప్పారు. టీడీపీ నేత నారా లోకేష్ పై జబర్ధస్త్ పంచ్ లు వేశారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు వివాదాస్పందగా మారాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని లోకేష్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా కాపాడాలి అంటే ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని చాలా రోజుల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇటు సీఎం జగన్ కు లేఖలపై లేఖలు రాస్తున్నారు. అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ కు లేఖలు రాశారు. అక్కడితోనే ఆగలేదు న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లి దండ్రుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ యూత్ ఆధ్వర్యంలో దీనిపై ప్రత్యేక పోరాటానికి తెరలేపారు. ఇంత చేస్తున్నా వైసీపీ మాత్రం నోవే అంటోంది. ఆరు నూరైనా.. పరీక్షలు నిర్వహించే తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కష్ట సమయంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. తాజాగా బోర్డు అధికారులు పరీక్షల తేదీలపైనా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జులై మొదటి వారంలో ఇంటర్, జులై ఆఖరి వారంలో పది పరీక్షలు ఉంటాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. బోర్డు అధికారులు పది పరీక్షలు జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు జరిగే అవకాశం ఉందంటూ సంకేతాలు ఇచ్చారు..

  ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇస్తున్నా లోకేష్ వెనక్కు తగ్గడం లేదు పరీక్షలు రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేసైనా పరీక్షలను రద్దు అయ్యేలా చేస్తామంటున్నారు. దీంతో లోకేష్ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా? అని రోజా ప్రశ్నించారు.

  ఇదీ చదవండి: చెట్టుపైనే అతడి నివాసం.. తిండి, నిద్రా అక్కడే.. ఎందుకో తెలుసా?

  లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో మొద్దుల్లాగా వెనుకబడిపోవాలని కోరుకుంటున్నట్టుంది అని విమర్శించారు. ఆయన పోరాటం చూస్తే అందుకేనేమో అనిపిస్తోందని సెటైర్ వేశారు. రాష్ట్రంలో పరీక్షలు జరుపుతామనో, జరపబోమనో సీఎం జగన్ ఇప్పటికీ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, లోకేశ్ ఈ విషయం గుర్తించాలని రోజా హితవు పలికారు. పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఈ పరీక్షలు జరపడానికి అనువైన సమయం కోసం సీఎం జగన్ చూస్తున్నారని వివరించారు.

  ఇదీ చదవండి: పురుషుడివని నిరూపించుకుంటేనే పెన్షన్... వృద్ధుడికి అధికారుల వింత కండిషన్

  రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి వచ్చిందని, పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పరీక్షలు జరిపితే వారికి నాణ్యమైన విద్యను అందించిన వారమవుతామని రోజా పేర్కొన్నారు. పరీక్షలు లేకపోతే లోకేశ్ వంటి మొద్దు పిల్లలు సంతోషపడతారేమో కానీ, బాగా చదివే పిల్లలు పరీక్షలు లేకపోతే ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఇంటర్ చదువే ప్రాతిపదిక అని, ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థుల్లో ఉదాసీన వైఖరి ఏర్పడుతుందని రోజా అభిప్రాయపడ్డారు. జగన్ పై మెంటల్ మామ అని విమర్శలు చేస్తుండడంపైనా రోజా చిరునవ్వుతో స్పందించారు. జగన్ మెంటల్ మామో, చందమామో ప్రజలందరికీ తెలుసని, చందమామ వంటి జగన్ ను విద్యార్థులు ఎంతో ఆప్యాయంగా మామ అంటారని వివరించారు. ఆ మెంటల్ అనేది చంద్రబాబు, లోకేశ్ లకు వర్తిస్తుందని విమర్శలను తిప్పికొట్టారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MLA Roja, Nara Lokesh, Roja Selavamani, Ssc exams

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు