HOME »NEWS »POLITICS »mla roja plans to get minister post in andhra cabinet she feels unhappy with party leaders bk

MLA Roja: రోజా స్కైచ్ ఇదేనా? ఈ సారైన వర్కవుట్ అవుతుందా?

MLA Roja: రోజా స్కైచ్ ఇదేనా? ఈ సారైన వర్కవుట్ అవుతుందా?
రోజా ఫైల్ ఫోటో

పార్టీ అధికారంలో లేన‌ప్పుడు కీల‌కంగా వ్య‌హారించిన రోజా....అధికారంలోకి వ‌చ్చాక త‌న‌కు ప్రాదాన్య‌త ద‌క్క‌డం లేదంటూ ఆవేద‌న‌ వ్య‌క్తం చేయ‌డానికి కార‌ణ‌మేంటీ? అధినేత జ‌గ‌న్ దృష్ఠిలో ప‌డేందుకేనా? ప‌బ్లిక్ గా త‌న ఆవేధ‌న చెప్పుకుంటే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ నాటికి జ‌గ‌న్ క‌నిక‌రిస్తార‌నే ఆలోచ‌నేనా? పార్టీలో హ‌ట్ టాఫిక్ గా మారిన రోజా అంశం.

 • Share this:
  రోజా ఏపీ రాజ‌కీయ‌ల్లో ఈమెది ప్ర‌త్య‌క స్థానం . ఒక మ‌హిళ శాస‌న స‌భ్యురాలిగా రోజాది మొద‌టి నుంచి వివాద‌స్ప‌ద గ‌త‌మే...రాజ‌కీయాల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌స్తుతం ఆమె చేస్తోన్న జ‌బ‌ర్ద‌స్త్ షో వ‌ర‌కు అన్నింటిలో ఆమె కాస్త ఫైర్ బ్రెండ్ గానే పేరు తెచ్చుకున్నారు. దివంగ‌త నేత శివ‌ప్ర‌సాద్ స‌హాకారంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రోజు అప్ప‌ట్లో టీడీపీ తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలిగా త‌న కంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అక్క‌డ త‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త దొర‌క‌డం లేద‌ని బాబు, లోకేష్ నిర్ల‌క్ష్యాని బ‌ల‌వుతున్నాని భావించి వైఎస్ ఆర్ పంచ‌న చేరారు. అప్ప‌టి నుంచి త‌న‌దైన మాట తీరుతో రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. దీంతోపాటు పార్టీలో జ‌గ‌న్ కూడా ముఖ్యంగా చంద్ర‌బాబును ఏకీప‌డేసే అంశాల్లో రోజుకు కాస్త ఫ్రీ హ్యాండే ఇచ్చారు కూడా. ఇందులో జ‌గ‌న్ వ్యూహాం కూడా ఉంద‌నే అంటారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు టీడీపీ నుంచి త‌న పార్టీకి వ‌చ్చిన నేత‌ల‌తోనే బాబు ను తిట్టిస్తే స‌రిగ్గ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని జ‌గ‌న్ భావ‌న అందులో భాగంగానే కోడాలి నాని, రోజా లాంటి నేత‌ల‌ను బాబు పై వ‌దులుతారు జ‌గ‌న్.

  అయితే ఈ ఫ్రీ హ్యండ్ తో రెచ్చిపోయిన రోజా ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చేశారు. పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగారు. అది ఏ స్థాయిలో అంటే, అధికారం వ‌చ్చిన త‌రువాత తాను మంత్రిని కావ‌డం ఖాయం అనేంత‌గా ఎదిగారు రోజా. కాని మంత్రి ప‌ద‌వుల విస్త‌రిలో రోజాకు జ‌గ‌న్ మొండి చేయి చూపించారు. సామాజిక వ‌ర్గాల లెక్క‌ల్లో రోజా మంత్రి ప‌దవి ఆశ‌లు అడిఆశ‌లైయ్యాయి. దీంతో చేసేది లేక ఏదో చిన్న ప‌ద‌వితో స‌రిపెట్టుకున్నారు. అయితే ఎప్ప‌టికైన త‌న‌కి మంత్రి ప‌ద‌వి వ‌స్తోంద‌ని ఆశ‌గా ఉన్న రోజాకు ఈ మ‌ధ్య పార్టీలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలు మింగుడ‌ప‌డ‌డం లేదు. జ‌గ‌న్ ద‌ర్శ‌నం దొర‌క‌ని నేత‌ల లిస్ట్ లో ఆమె కూడా చేరిపోవ‌డం ఇప్పుడు ఆమె జీర్ణించుకోలేక‌పోతున్నారు. పార్టీలో ఫైర్ బ్రెండ్ గా పేరొందిన త‌న‌కే పార్టీలో స‌రైన ప్రాదాన్య‌త ల‌భించిక‌పోవ‌డం పై ఆమె ఆవేధ‌న వ్య‌క్తం చేస్తోన్నారు. ఈ అంశంపై  ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రోజా ఇప్పుడు ఒక్క‌సారిగా ఓపెన్ అవ్వ‌డం స్టార్ట్ చేశారు. త‌న‌కు ప్రాదాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని స‌భా ముఖంగా పబ్లిక్ మీటింగ్స్ లో వ్యాఖ‌లు చేస్తోన్నారు.  పార్టీలో కొంత మంది త‌న‌కు అడ్డుప‌డుతున్నారంటు ఆవేధ‌న వ్య‌క్తం చేస్తోన్నారు. అయితే ఇదంత రోజా వ్యూహాత్మ‌కంగానే చేస్తోన్న‌ట్లు స‌మ‌చారం. గ‌తంలో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌న‌కి కాకుండా మంత్రి ప‌ద‌వి ఎవ‌రికిస్తారనే న‌మ్మ‌కంలో ఉన్న రోజా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు అప్పట్లో. అదే అప్పుడు ఆమె కొంప ముంచింది. ఇప్పుడు కూడా జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే మ‌ళ్లీ అదే సీన్ రిఫీట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఆమె భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే త‌న‌కు ఎలాంటి అన్యాయం జ‌రుగుతుంద‌నే అంశం అధినేత దృష్ఠిలో వేసేందుకే రోజా ఇలా ఓపెన్ అవుతున్నార‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే రోజా ఎంచుకున్న ప‌ద్ద‌తిపై పార్టీలో కొంత మంది అభ్యంత‌రం చెబుతున్నారు. ఇలా బ‌హిరంగంగా మాట్లాడితే పార్టీ ప‌రువు ఏమ‌వుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
  Published by:Balakrishna Medabayani
  First published:January 21, 2021, 10:39 IST