సీఎం జగన్‌కు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే రోజా

పొదుపు సంఘాల కార్యకలాపాల్లో అట్టడుగు స్థాయిలో పనిచేసే వీవోఏలకు గౌరవ వేతనాన్ని రూ.10,000కు పెంచుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: November 14, 2019, 2:51 PM IST
సీఎం జగన్‌కు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే రోజా
వైఎస్ జగన్ చిత్రపటానికి రోజా పాలాభిషేకం
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి APIIC ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాలాభిషేకం చేశారు. గ్రామ సంఘ సహాయకురాలు (వీవోఏ)ల గౌరవ వేతనాన్ని రూ. 2 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా విజయపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వీవోఏలు కృతజ్ఞతాభినందనసభ ఏర్పాటు చేశారు. ఆ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రోజా.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వీవోఏలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

పొదుపు సంఘాల కార్యకలాపాల్లో అట్టడుగు స్థాయిలో పనిచేసే వీవోఏలకు గౌరవ వేతనాన్ని రూ.10,000కు పెంచుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 1 నుంచి గౌరవ వేతనాల పెంపు అమలులోకి వస్తుందని పేర్కొంది. వీవోఏలను గతంలో వెలుగు యానిమేటర్లు, సంఘమిత్రలు అని పిలిచేవారు. పొదుపు సంఘాల సభ్యుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం లాంటి కీలక బాధ్యతలను వీవోఏ నిర్వర్తిస్తుంటారు.
Published by: Shiva Kumar Addula
First published: November 14, 2019, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading