MLA Roja: ఈ దృశ్యం సీఎం జగన్ కంటపడిందో.. లేదో.. చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీ.. విషయమేంటంటే..

నగరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే రోజా

తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఏపీ రాజకీయాలపై కనీస ఆసక్తి, అవగాహన ఉన్న వారికి వైసీపీ ఎమ్మెల్యే రోజా సుపరిచితురాలే. బుల్లితెరపై నవ్వుల రోజాగా కనిపించే ఈ ఎమ్మెల్యే రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులపై పదునైన వాక్బాణాలతో విరుచుకుపడుతూ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయాల్లో...

  • Share this:
    నగరి: తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఏపీ రాజకీయాలపై కనీస ఆసక్తి, అవగాహన ఉన్న వారికి వైసీపీ ఎమ్మెల్యే రోజా సుపరిచితురాలే. బుల్లితెరపై నవ్వుల రోజాగా కనిపించే ఈ ఎమ్మెల్యే రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులపై పదునైన వాక్బాణాలతో విరుచుకుపడుతూ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను ఎమ్మెల్యే రోజా నిజం చేశారు. జిల్లాలో ఉన్న గ్రూపు తగాదాలను పక్కనపెట్టి.. పొసగని నేతతోనే కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒకప్పుడు ఒకరినొకరు బాహాటంగానే విమర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, నగరి ఎమ్మెల్యే రోజా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కలిసి ముందుకెళ్లడం విశేషం. ఇప్పుడు ఇదే చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు నారాయణ స్వామి, రోజా మధ్య మాటల యుద్ధం నడిచింది.

    నగరిలో ఎమ్మెల్యే రోజా లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సమీక్ష నిర్వహించడంతో ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే అయిన తాను లేకుండానే సమీక్ష జరపడం ఏంటని రోజా డిప్యూటీ సీఎంపై మండిపడ్డారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు వచ్చి తమ నియోజకవర్గంలో సమావేశం పెట్టడం ఏంటని ఆమె వర్గీయులు అప్పట్లో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అయినా.. నగరిలో తనకు చెప్పకుండా ఎలా పర్యటిస్తారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై నారాయణ స్వామి కూడా కౌంటర్ ఇచ్చారు. తాను డిప్యూటీ సీఎంనని, ఎక్కడికైనా వెళ్లవచ్చని.. ఎవరి అనుమతి అక్కర్లేదని ఆయన కూడా కొంత ఘాటుగానే రోజాకు బదులిచ్చారు. అప్పటి నుంచి అంటీముట్టనట్టుగా ఉంటున్న ఈ నేతలిద్దరూ మున్సిపల్ ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కలిసి ముందుకెళ్లడం చిత్తూరు జిల్లా వైసీపీలో ఒకింత ఆసక్తికర పరిణామమే.

    ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే రోజాకు ప్రత్యర్థి పార్టీల్లోనే కాకుండా సొంత పార్టీలో కూడా వైరి వర్గం ఉందని నగరి నియోజకవర్గంలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు, సొంత సామాజిక వర్గ నేతలతోనే రోజాకు పొసగడం లేదని, చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారమూ ఉంది. మొన్న‌టికి మొన్న పార్టీలో కొంత మంది త‌న‌ను కావాల‌ని టార్గెట్ చేస్తున్నారని రోజా బ‌హిరంగంగానే వాపోయారు. జగన్ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. రామచంద్రారెడ్డికి, ఎమ్మెల్యే రోజాకు విభేదాలు తారాస్థాయికి చేరాయని ఒకానొక దశలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గంగా ఉన్న కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కడంలో మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని, నగరి ఎమ్మెల్యేతో పొసగని వారిని ఆయన ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో రోజా ఉన్నట్లు సోషల్ మీడియా ఒక దశలో కోడై కూసింది. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి రక్షా బంధన్ రోజున రాఖీ కట్టిన రోజా.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలను పంపారు.

    పెద్దిరెడ్డి కుటుంబీకులతో రాజీ పడ్డారన్న వాదనను రోజా కొట్టివేస్తూనే...తమ మధ్య ఎలాంటి విబేధాలు లేదని స్పష్టం చేశారు. అయితే డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో విబేధాలు ఉన్నాయంటూ వివిధ ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తాజాగా తిరుపతి ప్రివిలేజ్ కమిటీ పర్యటనలో అధికారులు., మంత్రులు ఎవరు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ రోజా కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఈ వివాదానికి మరింత బలం చేకూరింది. అయితే ఆమె ఇదే అంశంపై తిరుమలలో వివరణ కూడా ఇచ్చారు.

    తాజాగా.. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో నారాయణస్వామి, రోజా ప్రత్యర్ధులు అనే ప్రచారానికి తెరపడింది. ప్రజల సాక్షిగా వారిద్దరూ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇచ్చారు. రెండు మునిసిపాలిటీలు కలిగిన నగరి నియోజకవర్గంలో గెలుపు కోసం రోజా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజలు తమవైపు ఉన్నారనే ధీమా ఉన్నా అభ్యర్థులకు మనోధైర్యం ఇచ్చేందుకు ప్రతి వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పుత్తూరు మునిసిపాలిటీలోని 23 వార్డులో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రోజా కలసికట్టుగా ప్రచారం చేశారు. ఏదైతేనేం వారిద్దరూ విభేదాలను పక్కన పెట్టి ముందుకెళ్లడం శుభ పరిణామంగా చిత్తూరు జిల్లా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published: