Roja Selvamani: వైఎస్ వర్థంతి కార్యక్రమంలో రోజా పాల్గొనలేకపోవడానికి కారణం అదేనా?

YSR Vardhanthi: నగరిలో జరిగిన వైఎస్ వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

news18-telugu
Updated: September 2, 2020, 8:14 PM IST
Roja Selvamani: వైఎస్ వర్థంతి కార్యక్రమంలో రోజా పాల్గొనలేకపోవడానికి కారణం అదేనా?
సెల్వమణి, రోజా
  • Share this:
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఏపీలోని వాడవాడల్లో ఆయన చిత్ర పటానికి అంజలి ఘటించి నివాళి అర్పించారు వైసీపీ శ్రేణులు. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్‌ను స్మరిస్తూ ఫొటోలకు నివాళి అర్పించారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రోజా సెల్వమణి పాల్గొనలేదు. ఆమె నాలుగు రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డితో కలిసి ఓ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమె హోం ఐసొలేషన్‌లో ఉన్నారని సమాచారం. అయితే, రోజా రాకపోవడానికి ఇదే కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో నగిరిలో జరిగిన వైఎస్ వర్థంతి కార్యక్రమానికి ఆమె దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఆమెకు బదులుకు ఆమె భర్త సెల్వమణి అక్కడ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. సెల్వమణి స్వయంగా పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగువారి గుండెల్లో నిలిచి ఉంటారని సెల్వమణి అన్నారు.



తాను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా, వైఎస్‌‌కు ఫేస్ బుక్ సాక్షిగా నివాళి అర్పించారు రోజా. ‘వైఎస్ఆర్ మరణించి 11 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయన లక్షల మంది గుండెల్లో జీవించే ఉంటారు. రైతులు, ఫీజు రీయింబర్స్ పొందిన విద్యార్థులు, స్వావలంభన సాదించిన మహిళలు, ఆరోగ్యంగా ఉన్నవారి గుండెల్లో (ఆరోగ్య శ్రీని పరోక్షంగా ప్రస్తావిస్తూ) జీవించే ఉంటారు. ఆయన మన అందరిలోనూ ఉంటారు.’ అంటూ ఫేస్ బుక్‌లో నివాళి అర్పించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 2, 2020, 8:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading