బలిసిన కోడి ఫార్ములాయే లోకేష్‌కీ వర్తిస్తుంది : రోజా

నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి అపరకాళికలా మారారు. ప్రతిపక్ష టీడీపీనీ, చంద్రబాబునీ, లోకేష్‌నీ, యనమలపై విమర్శల దాడి చేశారు.

news18-telugu
Updated: January 27, 2020, 9:48 AM IST
బలిసిన కోడి ఫార్ములాయే లోకేష్‌కీ వర్తిస్తుంది : రోజా
ఈ తెలుగుదేశం వాళ్లు ఎన్ని ట్రోల్స్ చేసినా తాను పట్టించుకోనని చెప్పింది. ఎందుకంటే వీళ్లున్నది 10 శాతం అయితే.. ఎంకరేజ్ చేసే వాళ్లు 90 శాతం మంది అంటుంది రోజా. అయినా తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత డాన్సులు చేయడం లేదని.. కుర్చీలోనే ఉండి అలా చేస్తున్నట్లు చెప్పింది. తన లిమిట్స్ తనకు తెలుసు అంటుంది రోజా.
  • Share this:
ఏపీ శాసన మండలి రద్దు ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం తెచ్చిన సమయంలో... వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయమైనా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పే వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా కూడా తన అభిప్రాయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. ఆమె ఏమన్నారంటే.... "'టీడీపీ పెద్దల సభను అపహాస్యం చేస్తోంది. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని... మండలి ఛైర్మన్‌ను ఎలా కంట్రోల్ చేశారో అందరూ చూశారు. ఇది దురదృష్టకరం. అప్పట్లో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారు. గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు. వారిలో నలుగురిని మంత్రుల్ని చేశారు. ఇలా చంద్రబాబు వ్యవస్థల్ని బ్రష్టుపట్టిస్తున్నారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారుతున్నారు" అని రోజా ఫైర్ అయ్యారు. అంతే కాదు ఇంకా రోజా ఏమన్నారంటే... "మండలిలో టీడీపీ రూల్స్ ప్రకారం వెళ్లలేదు. ముందుగా నోటీస్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా చెయ్యలేదు. మండలికి వెళ్లే బిల్లుల్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తిప్పికొడుతున్నారు. శాసన మండలిని రద్దు చేయాల్సిందే. రాయలసీమను చంద్రబాబు నాశనం చేశారు. ఇప్పుడు సీఎం జగన్... రాయలసీమను అభివృద్ధి వైపు నడిపిస్తూ... కర్నూలును రాజధానిగా చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు, ఆయన బినామీలూ అమరావతిలో భూముల్ని కాపాడుకోవడానికే... మండలిలో డ్రామా ఆడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 80 శాతం హామీలను నెరవేర్చారు. ప్రజలంతా ఆయన్ను మెచ్చుకుంటున్నారు. ప్రజా తీర్పును గౌరవించాల్సిన టీడీపీ... కావాలని మండలిలో లేటు చేస్తూ... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. లోకేష్ ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీలవుతున్నాడు. బాగా బలిసిన కోడి... చికెన్ షాపు ముందు తొడగొడితే ఏమవుతుంది... కోసి కారం పెడతారు... ఆ విషయం లోకేష్ తెలుసుకోవాలి. యనమలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మండలి ఉండటం వేస్ట్. దానికి పెట్టే ఖర్చు వృథా. దాన్ని తొలగించాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు. పెద్దల సభ అంటే పెద్దల్ని ఆ సభకు పంపాలి... ఇంట్లోని దద్దమ్మల్నీ, దద్దోజనాన్నీ పంపకూడదు. చంద్రబాబుకి ఓడినా అహంకారం తగ్గలేదు" అని టీడీపీపై రోజా ఫైర్ అయ్యారు.


Video: జనాలపై పంజా విసిరిన పులి.. ముగ్గురికి గాయాలుPublished by: Krishna Kumar N
First published: January 27, 2020, 9:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading