Roja: చంద్రబాబు జీవితమంతా దానికే సరిపోయింది.. మండిపడ్డ రోజా

Roja: తిరుపతి ఎంపీ కరోనాతో మృతి చెందితే.. చంద్రబాబు హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయో అని ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: November 20, 2020, 2:57 PM IST
Roja: చంద్రబాబు జీవితమంతా దానికే సరిపోయింది.. మండిపడ్డ రోజా
రోజా, చంద్రబాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని చంద్రబాబు మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని మండిపడ్డారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చేనాటికి ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉందని.. అయినా జగన్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తున్నారని రోజా కొనియాడారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా.. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలకే సరిపోయిందని రోజా ఆరోపించారు.

తిరుపతి ఎంపీ కరోనాతో మృతి చెందితే.. హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయో అని ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎం పనిచేసిన చంద్రబాబు కరోనా సమయంలో ఏపీ ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నాడని రోజా విమర్శించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు.

స్థానిక సంస్థల ఫండ్స్‌ రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఎన్నికలు పెడితే.. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా పడేలా చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో అసలు కరోనానే లేదని తమకు తాము ప్రకటనలు చేసి ఎన్నికలు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే తాము గెలిచేస్తామని కలలుకంటున్నారని ఎద్దే చేశారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని రోజా మరోసారి స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: November 20, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading