అసెంబ్లీలో బాలకృష్ణకు రోజా పంచ్... బాహుబలి డైలాగ్‌తో...

ఏపీలోని మహిళలు తమపై దాడి జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తారనే నమ్మకంతో ఉన్నారని రోజా అన్నారు.

news18-telugu
Updated: December 9, 2019, 12:50 PM IST
అసెంబ్లీలో బాలకృష్ణకు రోజా పంచ్... బాహుబలి డైలాగ్‌తో...
బాలకృష్ణ, రోజా
  • Share this:
అసెంబ్లీలో ఊహించని విధంగా బాలకృష్ణకు పంచ్ ఇచ్చారు రోజా. మహిళల భద్రత అంశంపై తాము చర్చ జరపాలని భావిస్తుంటే... చంద్రబాబుకు భయం పట్టుకుందని రోజా విమర్శించారు. ఈ అంశంపై చర్చ జరిగితే నారా లోకేశ్ ఫోటోలు, గతంలో మహిళలపై బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వస్తాయేమో అని టీడీపీ భయపడుతోందని ఆమె మండిపడ్డారు. చంద్రబాబుకు ఆడపిల్ల లేదని... అందుకే ఆయనకు మహిళ భద్రత అంశంపై చర్చ జరగడం ఇష్టంలేదని ఆమె ఆరోపించారు. బాహుబలి సినిమాలో మహిళలపై వెకిలిగా వ్యవహరించిన వారిని హీరో చంపడాన్ని మహిళలందరూ హర్షించారని... బయట కూడా అలాంటి శిక్షలే ఉండాలని రోజా వ్యాఖ్యానించారు.

ఏపీలోని మహిళలు తమపై దాడి జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తారనే నమ్మకంతో ఉన్నారని ఆమె అన్నారు. ఏపీలో టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరికి ఇంతవరకు న్యాయం జరగలేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై చేయి వేయాలంటే భయపడేలా చట్టాలు ఉండాలని ఆమె అన్నారు. ఎవరైనా ఆడపిల్ల జోలికి వస్లే వారి వెన్నులో వణుకుపుట్టేలా చట్టం చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నానని రోజా అన్నారు.


First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>