హోమ్ /వార్తలు /politics /

YSRCP vs TDP: ఆ విషయంలో తగ్గేదేలే..! అంటున్న రోజా.., వివాదంలోకి పవన్ ను లాగిన బాలినేని..

YSRCP vs TDP: ఆ విషయంలో తగ్గేదేలే..! అంటున్న రోజా.., వివాదంలోకి పవన్ ను లాగిన బాలినేని..

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) sమధ్య వార్ కొనసాగుతోంది. రెండు పార్టీలు పోటాపోటీ నిరసనలతో వాతావరణం వేడెక్కింది.

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader Pattabhi) చేసిన కామంట్స్ రాష్ట్రంలో రాజకీయ రచ్చను రేపాయి. ఇటు వైఎస్ఆర్సీపీ (YSRCP), అటు టీడీపీ (TDP) సై అంటే సై అంటూ మాటల యుద్ధాన్ని దాటి భౌతిక యుద్ధానికి తెరలేపాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్షకు కూర్చుంటే.. సీఎంను దూషించారంటూ వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టింది. దీంతో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యనేతలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చాలా చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేయడమే కాకుండా.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేస్తూ నిరతన తెలుపుతున్నారు. ఈ నిరసనల్లో వైసీపీ కార్యకర్తలతో పాటు మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొని చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

  రోజా ఫైర్..

  చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA Roja) ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిలాంటి వ్యక్తులతో ప్రెస్ మీట్ పెచ్చించిన చంద్రబాబు.., సీఎంను ఆయన తల్లి విజయమ్మను తిట్టించారని మండిపడ్డారు. పట్టాభి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రోజా. చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో కూర్చొని చీకట్లో వైఎస్ఆర్ విగ్రహాలను,ఆలయల్లో రథాలను తగుల పెట్టించారని ఆరోపించారు. కార్యాలయంలో నాలుగులు కుర్చీలు విరగ్గొడితే ప్రజస్వామ్యం ఖూనీ అయిందా అని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై చెప్పులు విరిసిరనప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవలేదా అని రోజా నిలదీశారు. తిరుమల వచ్చిన అమత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాలనడం సిగ్గుచేటని విమర్శించారు.

  ఇది చదవండి: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..


  పవన్ ను లాగిన బాలినేని..

  ఇక చంద్రబాబు దీక్షపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Minister Balineni Srinivas Reddy) స్పందించారు. చంద్రబాబు బహిరంగంగా కాకుండా పార్టీ కార్యాలయంలో దీక్షచేయడమేంటని ప్రశ్నించారు. జనసేన (Janasena)అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తిడితే ఆయన అభిమానులు దాడి చేసినట్లే.. సీఎం జగన్ ను దూషిస్తే టీడీపీ కార్యాలయంపై దాడిజరిగిందని చెప్పారు. సీఎం జగన్ ను తిడితే వైసీపీ కార్యకర్తలు ఊరుకోరని ఆయన అన్నారు. సీఎం జగన్ మొనగాడని.. ఆయన తలుచుకుంటే చంద్రబాబు, లోకేష్ భస్మమవుతారన్నారు. వచ్చే 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. అంతేకాదు ఇంకోసారి నోరుజారితే కాళ్లు, చేతులు విరుగుతాయని హెచ్చరించారు. మీరు మర్యాదగా ఉన్నంతకాలం తాము కూడా ఉంటామని.. ఆలా కాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తీవ్రంగా హెచ్చరించారు.

  ఇది చదవండి: “పట్టాభిది తప్పైతే.. మీ మంత్రులదీ తప్పే..” దీక్ష ప్రారంభించిన చంద్రబాబు...


  ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనాగ్రహదీక్షలో పాల్గొన్న ఎంపీ భరత్.. చంద్రబాబు ఫ్లెక్సీకి చెప్పులదండ వేయించి నిరసన తెలిపారు. అంతేకాదు సర్వమత ప్రార్ధనలు కూడా చేయించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Balineni srinivas reddy, MLA Roja, Ysrcp

  ఉత్తమ కథలు