చంద్రబాబు అందుకు సిగ్గుపడాలి.. టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు : రోజా

వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన ఇంటిని ముంచాలని భావించిందని చంద్రబాబు చేసిన ఆరోపణలపై రోజా కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: August 21, 2019, 12:44 PM IST
చంద్రబాబు అందుకు సిగ్గుపడాలి.. టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు : రోజా
రోజా (File Photo)
news18-telugu
Updated: August 21, 2019, 12:44 PM IST
టీడీపీ అధినేత చంద్రబాబును తాము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని.. ప్రజలే ఆయన్ను టార్గెట్ చేసి ఇంటికి పంపించారని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఎద్దేవా చేశారు.వరదలపై టీడీపీ నేతలు చౌకబారు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా ఉండటంతో.. ఓర్వలేకనే చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. ముంపు ప్రాంతాలను గుర్తించేందుకు డ్రోన్లను వాడితే.. అదేదో చంద్రబాబు ప్రాణాలు తీయడానికి వాడినట్టుగా రాద్దాంతం చేయడం సరికాదన్నారు.అసలు కృష్ణా నది కరకట్ట వద్ద ఇల్లు నిర్మించకూడదని ఎంతమంది చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదని.. సీఎం హోదాలో ఉంటూ ఓ అక్రమ కట్టడంలో నివసించినందుకు సిగ్గుపడాలని విమర్శించారు.

కాగా, వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన ఇంటిని ముంచాలని భావించిందని చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ఇంటిని ముంచాలని ప్లాన్ వేస్తే.. పేదల ఇల్లు మునిగిపోయాయని ఆయన అన్నారు. తనపై కక్ష సాధించేందుకే వైసీపీ నేతలు చౌకబారు వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నీటిని దిగువకు వదలకుండా కృతిమ వరదలు సృష్టించి రాజధాని అమరావతిని
ముంపు ప్రాంతంగా చిత్రీకరించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా కౌంటర్ ఇచ్చారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...