గుంటూరు వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ

కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేశ్ మధ్య విభేదాలు ఏకంగా సీఎం జగన్ వరకు వెళ్లాయి. తాజాగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు విభేదాలు వెలుగులోకి వచ్చాయి.

news18-telugu
Updated: August 16, 2019, 3:20 PM IST
గుంటూరు వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేశ్ మధ్య విభేదాలు ఏకంగా సీఎం జగన్ వరకు వెళ్లాయి. తాజాగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ కృష్ణదేవరాయుల చిలకలూరిపేట పర్యటనకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే విడదల రజినీ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయుల దగ్గరే ఎమ్మెల్యే రజినీ వర్గం పంచాయతీ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమ నియోజకవర్గానికి వస్తున్నప్పుడు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే రజినీ వర్గీయులు ఎంపీతో అన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిశీలించాలని ఎమ్మెల్యే రజినీ వర్గీయులు ఫిర్యాదు చేశారు.

కొద్దిరోజుల క్రితం బాపట్ల ఎంపీ సురేశ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. తన నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి ఎంపీ సురేశ్ వర్గీయులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన వైసీపీ ముఖ్యనేతలు... సమస్యను పరిష్కరించారు. మరి... తాజాగా ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు వైసీపీ అగ్రనేతలు చొరవ తీసుకుంటారేమో చూడాలి.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు