GHMC Elections: బండి సంజయ్‌తో గొడవలు నిజమా? రాజాసింగ్ ఏమన్నారంటే..

గ్రేటర్ ఎన్నికల వేళ పార్టీలో ఏంటీ రచ్చని.. చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఇందులో నిజం లేదు. ఇది తప్పుడు ప్రచారమని రాజాసింగ్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: November 22, 2020, 9:37 PM IST
GHMC Elections: బండి సంజయ్‌తో గొడవలు నిజమా? రాజాసింగ్ ఏమన్నారంటే..
బండి సంజయ్, రాజాసింగ్
  • Share this:
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. గోషా మహల్ నియోజక పరిధిలోని డివిజన్లలో రాజాసింగ్ సూచించిన వారికి కాకుండా.. వేరే వారికి బండి సంజయ్ టికెట్లు ఇస్తున్నారంటూ రాజాసింగ్ పేరిట ఓ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. పార్టీని బతికించాలంటే అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని రాజాసింగ్ డిమాండ్ చేసినట్లు ఆ ట్వీట్‌లో ఉంది. ఆ ఫొటో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. గ్రేటర్ ఎన్నికల వేళ పార్టీలో ఏంటీ రచ్చని.. చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఇందులో నిజం లేదు. ఇది తప్పుడు ప్రచారమని రాజాసింగ్ స్పష్టం చేశారు.

'' నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. నా పేరుతో ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరో ఎడింటింగ్ చేశారు. తప్పుడు ప్రచారం ద్వారా.. పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తాం.'' అని ట్విటర్‌లో పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.




కాగా, బండి సంజయ్‌పై తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. టికెట్ల విషయంలో మాత్రం పార్టీలో రచ్చ జరుగుతోంది. ఆదివారం గన్‌ఫౌండ్రీకి చెందిన బీజేపీ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కొట్టుకున్నారు. గన్‌ఫౌండ్రీ టికెట్‌ను తమకు కాకుండా ఓం ప్రకాశ్ భార్యకు కేటాయించడంపై శైలేంద్రయాదవ్ వర్గం భగ్గుముంది. ఓ ప్రకాశ్ వర్గం బీఫామ్ తీసుకునేందుకు పార్టీ కార్యాలయానికి రావడంతో.. వారిపై శైలేంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు ఘర్షణపడ్డారు. పార్టీ పెద్దలపై మండిపడుతూ.. శైలేంద్ర వర్గం ఫర్నిచర్ ధ్వంసం చేసింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ టికెట్లు అమ్ముకుంటున్నారని కార్యకర్తలు ఆరోపించారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని విరుచుకుపడ్డారు.

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు పెరిగినందున.. టికెట్ల కేటాయింపు విషయంలో.. లొల్లి జరుగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా రాష్ట్ర అధిష్టానంపై మండిపడుతున్నారు. పార్టీ ఆఫీసులకు వెళ్లి రచ్చ చేస్తున్నారు. మొన్న కూకట్‌పల్లి కార్యాలయంలో.. నిన్న కుత్బుల్లాపూర్ కార్యాలయంలోనూ.. ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. పార్టీ కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేసి రచ్చ చేశారు. బీజేపీలో నెలకొన్న ఈ టికెట్ల రచ్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2020, 9:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading