హిందూపురంలో బాలయ్య నమాజ్.. ముస్లింలకు ఇఫ్తార్ విందు..

రంజాన్ నెల ఆఖరి శుక్రవారం కావడంతో ముస్లింలతో కలసి బాలయ్య కూడా సాయంత్రం నమాజ్‌కు వెళ్లారు. అనంతరం వారితో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

news18-telugu
Updated: May 31, 2019, 10:17 PM IST
హిందూపురంలో బాలయ్య నమాజ్.. ముస్లింలకు ఇఫ్తార్ విందు..
హిందూపురంలో బాలకృష్ణ ఇఫ్తార్ విందు
  • Share this:
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ నెల ఆఖరి శుక్రవారం కావడంతో ముస్లింలతో కలసి బాలయ్య కూడా సాయంత్రం నమాజ్‌కు వెళ్లారు. అనంతరం వారితో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అయితే, నమాజ్ ముగిసిన వెంటనే హిందూపురంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షంలోనే ఇఫ్తార్ విందు కొనసాగింది. బాలయ్య కోసం అభిమానులు గొడుగు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా హిందూపురంలో ముస్లింలకు బాలయ్య ఇఫ్తార్ విందు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఆనవాయితీ కొనసాగించారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. రాష్ట్రం మొత్తం జగన్ హవా నడిచినా.. హిందూపురంలో బాలయ్య రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు