ఖబడ్దార్.. కబ్జాదారుడివి నువ్వు.. ఇవిగో సాక్ష్యాధారాలు.. : మల్‌రెడ్డికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కౌంటర్

మంచిరెడ్డి కిషన్ రెడ్డి,మల్‌రెడ్డి రంగారెడ్డి (File Photo)

TSRTC Strike : మల్‌రెడ్డికి అతని తండ్రి ద్వారా సంక్రమించింది కేవలం రెండెకరాలు అని.. ఇప్పుడు ఈ స్థాయిలో భూములు సంపాదించేందుకు సంపాదన ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఎల్బీనగర్,దిల్‌సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు.

  • Share this:
    తహశీల్దార్ విజయా రెడ్డి హత్య కేసులో కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. తనపై బురదజల్లి రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతో మల్‌రెడ్డి రంగారెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. భూకబ్జాదారుడు ఎవరనేది నిరూపించేందుకు తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. బాచారంలోని సర్వే నం.70 నుంచి 101 వరకు ఉన్న 412 ఎకరాల భూముల్లో మల్‌రెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండానే రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పాస్‌బుక్స్ లేకపోయినా పహాణీలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా సీఎస్,డీజీపీలకు లేఖలు రాస్తున్నానని తెలిపారు.

    తనకు తాతలు,తండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు ఉన్నాయని.. అంతే తప్ప ఎన్నడూ ఎక్కడా కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. కానీ మల్‌రెడ్డి మాత్రం ఎన్నో భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అంబర్ పేట్ ఓఆర్ఆర్ పక్కన సర్వే నం.230-233 వరకు ఉన్న 16 ఎకరాల భూమిని మల్‌రెడ్డి, రామ్‌రెడ్డి,సంజీవరెడ్డి ముగ్గురు కలిసి కబ్జా చేశారని ఆరోపించారు. దాని విలువ రూ.100కోట్లు ఉంటుందని.. కేవలం పహాణీ డాక్యుమెంట్స్‌తో ఆ భూమిని రిజిస్టర్ చేయించుకుని కాంపౌండ్ వాల్ కట్టేశారని ఆరోపించారు. అలాగే మెట్రో సిటీ సాగర్ రోడ్‌లో 60 ఎకరాలను భూమిలో ప్లాట్లు విక్రయించారని.. దానికి అనుమతులు ఉన్నాయో లేవో అని చెప్పుకొచ్చారు.ఆదిభట్లలో 10 ఎకరాలు,కోహెడ్,తొర్రూర్ లాంటి ప్రాంతాల్లోనూ కబ్జాలు చేశారని ఆరోపించారు. మల్‌రెడ్డికి అతని తండ్రి ద్వారా సంక్రమించింది కేవలం రెండెకరాలు అని.. ఇప్పుడు ఇంత స్థాయిలో భూములు సంపాదించేందుకు సంపాదన ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఎల్బీనగర్,దిల్‌సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. నియోజకవర్గంలో తనకు ఎంతోమంది అనుచరులు ఉన్నారని.. ఎవరో ఏదో చేస్తే.. అదంతా తానే చేశానని బురదజల్లడం సరికాదన్నారు. తనపై ఆరోపణలు చేస్తే.. వాటిని నిరూపించాలని.. లేదంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. నలుగురికి సాయం చేయడమే తెలుసు తప్పించి.. మల్‌రెడ్డి లాగా తనకు మోసాలు తెలియవని చెప్పారు.
    ఇది కూడా చూడండి:-

    First published: