నేను అర్జునుడిని...కోమటిరెడ్డి యూటర్న్..మళ్లీ కాంగ్రెస్‌కు జై

నిన్నమొన్నటి వరకు తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అంటూ బహిరంగంగా ప్రకటనలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి... తాజాగా కాంగ్రెస్‌దే అధికారమని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 16, 2019, 6:33 PM IST
నేను అర్జునుడిని...కోమటిరెడ్డి యూటర్న్..మళ్లీ కాంగ్రెస్‌కు జై
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకు తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అంటూ బహిరంగంగా ప్రకటనలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి... తాజాగా కాంగ్రెస్‌దే అధికారమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్‌ను నియంత అంటున్నామని మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణ విముక్తి కావాలని... అప్పుడు తెలంగాణ మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని వ్యాఖ్యానించారు. కౌరవులు వంద ఉన్నా పాండవులదే విజయమని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... కాంగ్రెస్ శాసనసభ్యులను పాండువులతో పోల్చారు.

తమ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కను శ్రీకృష్ణుడితో పోల్చిన రాజగోపాల్ రెడ్డి... శ్రీధర్ బాబును ధర్మరాజుగా, జగ్గారెడ్డిని భీముడిగా, తనను అర్జునుడిగా, సీతక్క, వీరయ్యను నకుల సహదేవులుగా అభివర్ణించారు. ఇప్పుడు కలియుగ మహాభారతంలో కాంగ్రెస్‌కు పదేళ్లు వనవాసం కాలం నడుస్తోందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమన్నదే నా లక్ష్యమని తెలిపారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading