ఎన్నికలు ఏవైన కావచ్చు కాని ఈ ప్రాంతంపైనే అందరి దృష్ఠి ఉంటుంది. అదే సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హింధూపూర్. పంచాయితీ ఎన్నికల్లో బాలయ్యే నేరుగా ప్రచారం చేసిన అధికారపార్టీ జోరును అడ్డుకోలేకపోయిన బాలయ్య మున్సిపాలిటీ ఎన్నికల్లోనైన ఆ సీన్ రిపీట్ కాకుండ ఉండేందకు చర్యలు చెపడుతున్నారు.
ఎన్నికలు ఏవైన కావచ్చు కాని ఈ ప్రాంతంపైనే అందరి దృష్ఠి ఉంటుంది. అదే సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హింధూపూర్. పంచాయితీ ఎన్నికల్లో బాలయ్యే నేరుగా ప్రచారం చేసిన అధికారపార్టీ జోరును అడ్డుకోలేకపోయిన బాలయ్య మున్సిపాలిటీ ఎన్నికల్లోనైన ఆ సీన్ రిపీట్ కాకుండ ఉండేందకు చర్యలు చెపడుతున్నారు.
ఒక వైపు అధికారపార్టీ పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఫుల్ జోష్ లో ఉంటే మరో వైపు ప్రతిపక్షపార్టీ పంచాయితీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను మున్సిపాలీటి ఎన్నికల్లో రాకుండా చూసుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలక మున్సిపాలిటీలపై ప్రతిపక్ష టీడీపీ ప్రత్యేక వ్యూహాంతో ముందుకెళ్లుతుంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో పార్టీలో కీలక నేతల నియోజకర్గాల్లో వచ్చిన ఫలితాలతో కార్యకర్తలు ఢీలా పడ్డారు. దింతో ఇప్పుడు మున్సిపాలిటి ఎన్నికల్లో ఆ సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతుంది. ముఖ్యంగా కీలక మున్సిపాలపై ప్రత్యేక దృష్ఠి పెట్టింది. అందులో భాగంగానే హిందూపూర్ మున్సిపాలిటీ పై ప్రత్యేక ధృష్ఠి పెట్టారు అధినేత చంద్రబాబు. ఇప్పటికే ఇక్కడ ప్రాతనిధ్యం వహిస్తోన్న బాలకృష్ణకు దిశానిర్ధేశం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా ఎలా ఉన్న ఇక్కడ మాత్రం తిరుగుండని భావించిన టీడీపీ గట్టి దెబ్బే తగిలింది. బాలయ్య నేరుగా ప్రచారం చేసిన ప్రయోజనం లేకపోయింది. ఏకగ్రీవాలను అడ్డుకున్న పోలీంగ్ రోజు మాత్రం టీడీపీ శ్రేణులు చతికిల్లపడ్డాయి. దీంతో నియోకవర్గం వ్యాప్తంగా ఉన్న 38 పంచాయితీల్లో టీడీపీ కేవలం 8 మాత్రం కైవసం చేసుకోగలిగింది.
దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పటికే బాలయ్య క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి లోకల్ కేడర్ తో మంతనాలు జరుపుతున్నారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గట్టి పోటీనే ఇచ్చింది. మొత్తం 38 స్థానాల్లో వైసీపీ సగం గెలుచుకోవడంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఓట్ల సహాయంతో మేయర్ పీఠం అప్పుడు దక్కించుకున్నారు. అయితే వైసీపీ అధికారంలో లేనప్పుడు ఈ స్థాయిలో ఇక్కడ కేడర్ ఉంటే ఇప్పుడు మరికాస్త పుంజుకునే అవకాశం ఉందని భావిస్తోన్నాయి పార్టీ శ్రేణులు. అందులో భాగంగానే బాలయ్యకు చంద్రబాబు పూర్తీ స్థాయిలో దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ముగిసే వరకు బాలయ్యను క్షేత్ర స్థాయిలో పర్యటన చేయమని బాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వారంలో మూడు రోజులపాటు పార్టీ కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడైన నేతల మధ్య విభేదాలు ఉంటే వాటి పరిష్కరించాల్సిగ బాలయ్యకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే అధికాపార్టీ నేతలు ఇక్కడ ప్రచారం ఊదరగొట్టేస్తోన్నారు. పార్టీ నేత ఇక్భాల్ ఇప్పటికే మున్సిపాలిటీ మొత్తం తిరుగుతూ కేడర్ లో ఉత్సాహాం నింపుతున్నారు. ఈ నేపధ్యంలో ఇక్కడ ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే ఆసక్తి అందరిల్లో నెలకుంది. పంచాయితీ ఎన్నికల్లో చతికిల్లపడ్డ బాలయ్య ఈ సారైన తన సత్తా చాటుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.