అసంతృప్తి లేదు.. అసలు కారణం ఇదీ..: మంత్రి పదవిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే

సోమవారం గుంటూరు బయలుదేరిన అరికెపూడి గాంధీ.. నగర శివారుకు చేరుకోగానే.. గన్‌మెన్లను వెనక్కి పంపించారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆయన తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. మంగళవారం కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

news18-telugu
Updated: September 11, 2019, 10:40 AM IST
అసంతృప్తి లేదు.. అసలు కారణం ఇదీ..: మంత్రి పదవిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే
అరికెపూడి గాంధీ (File Photos)
  • Share this:
తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న కారణంతో శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన తన గన్‌మెన్లను వెనక్కి పంపించడం దీనికి బలం చేకూర్చింది. అయితే తాజాగా దీనిపై నోరు విప్పిన అరికెపూడి.. జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.

తన మనవడిని చూసేందుకు గుంటూరు వెళ్లాలనుకున్నానని... అందుకే గన్‌మెన్లను వెనక్కి పంపించానని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతీసారి గన్‌మెన్లను తీసుకెళ్లాలంటే.. అక్కడి పోలీసుల అనుమతి తీసుకోవాల్సి రావడంతో ఇలా చేసినట్టు చెప్పారు.  అంతే తప్ప మంత్రి పదవి కోసం గన్‌మెన్లను పంపించి నిరసన వ్యక్తం చేసినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రిపదవి ఇచ్చినందుకు తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు. కేసీఆర్,కేటీఆర్‌లకు విధేయునిగా కొనసాగుతానని తెలిపారు. కాగా,సోమవారం గుంటూరు బయలుదేరిన అరికెపూడి గాంధీ.. నగర శివారుకు చేరుకోగానే.. గన్‌మెన్లను వెనక్కి పంపించారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆయన తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. మంగళవారం కేటీఆర్‌తో సమావేశమయ్యారు. మంత్రి పదవి రానందుకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు