ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని.. రాక్షస పాలన సాగుతోందని.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని చాలా రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. దీనిపై అధికార వైసీపీ (YSRCP) గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఐతే ఏపీలో లా అండ్ ఆర్డర్ పై వైసీపీ ఎమ్మెల్యేనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని.. రాక్షస పాలన సాగుతోందని.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని చాలా రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. దీనిపై అధికార వైసీపీ (YSRCP) గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఐతే ఏపీలో లా అండ్ ఆర్డర్ పై వైసీపీ ఎమ్మెల్యేనే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆ సీనియర్ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయనే మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. కొంతకాలంగా ప్రభుత్వంపై, పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న ఆయన... ఇప్పుడు ఏకంగా పోలీస్ వ్యవస్థనే టార్గెడ్చేశారు. బుధవారం వెంకటగిరి 9వ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో నక్సలిజం తగ్గింది.. మాఫియా పెరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనం.
ఆనం కామెంట్స్ అక్కడితో ఆగలేదు. లోకల్ మాఫియాతో పోలీసులు కుమ్మక్కయ్యారని.., ప్రజలను రక్షించవలసిన పోలీసులు ఇలా లోకల్ మాఫియాతో అంటకాగటంతో ప్రజలలో పోలీసు వ్యవస్థపై నమ్మకం సడలిపోతుందన్నారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ కి వెళితే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం సామాన్య ప్రజలలో రోజురోజుకు సడలిపోతోందని ఈ సందర్భంగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
అదికార పార్టీ ఎమ్మెల్యే, పైగా మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అయిన ఆనం రామనారాయణ రెడ్డి పోలీసుల సభలోనే నక్సల్స్, మాఫిగా గురించి మాట్లాడటం అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు అంటున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారో అర్ధమౌతుందని ఆరోపిస్తున్నాయి. గతంలో నక్సల్స్ ఉన్నారనే భయంతో మాఫియా, పోలీసులు కొంతలో కొంత జాగ్రత్త పడేవారని.., ఇప్పుడు తమని అడిగేవారే లేరని వారు విచ్ఛలవిడిగా అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్నారనేది సామాన్య ప్రజల భావన అంటున్నారు. ఐతే పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని కోట్లు వెనకేసుకుంటున్న రాజకీయ నేతలను వదిలేసి తమను నిందించడం సరికాదని కొందరు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకరిద్దరు అవినీతి అధికారులున్నారని.. మొత్తం వ్యవస్థనే విమర్శించడం బాలేదంటన్నారు.
ఏది ఏమైనప్పటికీ సమాజంలో మాఫియా గానీ.. వారిని వెనకుండి నడిపిస్తున్న రాజకీయ శక్తులు గానీ.. వారికి సహకరిస్తున్న పోలీసులు గానీ.. గతంలో నక్సల్స్ భయంతో ఇంతలా బరితెగించేవారు కాదని.. ఇప్పుడు అన్నల భయం లేకపోవడంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రజలంటున్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నేరగాళ్లతో చేతులు కలిపేవి కాదని.. అలా అని నక్సలైట్ వ్యవస్థను సమర్చిండతం లేదని కొందరు విశ్లేషకులుంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే శాంతి భద్రతలను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచిస్తన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.