ఓవైపు టీడీపీ ఛలో ఆత్మకూరుకు సిద్ధమవుతుంటే... అటు వైసీపీ కూడా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. కోడెల, యరపతినేని బాధితులతో ఆత్మకూరు వెళ్తామన్నారు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ బాధితులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పల్నాడులో టీడీపీ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారన్నారు అంబటి. కోడెల, యరపతినేని కేసు అటెన్షన్ డైవర్ట్ కోసమే అంటున్నారు వైసీపీ నేతలు. అందుకే ఆత్మకూరు ఇష్యూ తెరపైకి తెచ్చారంటున్నారు.
మరోవైపు చంద్రబాబు కూడా పల్నాడులోని నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. పల్నాడులో జరుగుతున్న అన్ని దుర్మార్గాలకూ ప్రభుత్వానిదే బాధ్యతని, బాధితులకు న్యాయం జరిగేంతవరకూ తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెడుతూ, "అధికారులు ఓ వైపు గుంటూరు శిబిరంలో చర్చలు చేస్తూ మరోవైపు గురజాల డివిజన్ లో 144 సెక్షన్ విధించారు. ఇది రాజకీయ శాంతిభద్రతల సమస్య. పండుగల శాంతిభద్రతల అంశం కాదు. ఇది రాష్ట్ర సమస్య కానీ, కేవలం పల్నాడు ప్రాంత సమస్య కాదు. బాధితులకు న్యాయం చేయాలన్నదే టీడీపీ దృఢ సంకల్పం" అన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:September 10, 2019, 13:35 IST