Home /News /politics /

MK STALIN TAKES OATH AS TAMIL NADU CHIEF MINISTER AT RAJ BHAVAN IN CHENNAI SK

MK Stalin: స్టాలిన్ అనే నేను.. తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత ప్రమాణ స్వీకారం

స్టాలిన్ ప్రమాణస్వీకారోత్సవం

స్టాలిన్ ప్రమాణస్వీకారోత్సవం

స్టాలిన్‌తో పాటు మొత్తం 34 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మందికి మళ్లీ కేబినెట్‌లో అవకాశం దక్కింది.

    తమిళనాడులో డీఎంకే సూర్యుడు ఉదయించాడు. తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆయన చేత ప్రమాణం చేయించారు. కరోనా నేపథ్యంలో నిరాడంబకరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం ఉందని డీఎంకే నేతలు ఇటీవల గవర్నర్‌ను కలిసి లేఖను సమర్పించారు. డీఎంకే అధినేత స్టాలిన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా ఎంకే స్టాలిన్‌ను గవర్నర్ ఆహ్వానించారు.


    స్టాలిన్‌తో పాటు మొత్తం 34 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మందికి మళ్లీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. అంతేకాదు 15 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు. కీలకమైన హోంశాఖతో పాటు పలు ఇతర శాఖలను సీఎం స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. దురైమురుగన్‌కు జలవనరులు, నీటి పారుదలశాఖ, చెన్నై మాజీ మేయర్ సుబ్రమణియన్‌కు ఆరోగ్యశాఖ, పళనివేల్ తంగరాజన్‌కు ఆర్థికశాఖ, అంబిల్ మహేష్‌కు విద్యాశాఖను కేటాయించారు.


    కాగా, తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. 234 సీట్లున్న తమిళనాడులో డీఎంకే కూటమి 159 సీట్లు సాధించింది. ఇందులో ఒక్క డీఎంకేకే 133 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమయింది. ఇక అన్నాడీఎంకే 66 సీట్లతో సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే మిత్రపక్షాలైన బీజేపీ 4, పీఎంకే 5 చోట్ల గెలుపొందాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: DMK, MK Stalin, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు