లైంగిక వేధింపుల ఆరోపణలు: ఎట్టకేలకు ఎంజే అక్బర్ రాజీనామా?

news18-telugu
Updated: October 14, 2018, 12:27 PM IST
లైంగిక వేధింపుల ఆరోపణలు: ఎట్టకేలకు ఎంజే అక్బర్ రాజీనామా?
ఎంజే అక్బర్ ఫైల్ ఫోటో..
  • Share this:
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఈ మేరకు అధికారిక వర్గాలు 'న్యూస్18'కి సమాచారం అందించాయి. నైజీరియా పర్యటన నుంచి ఈరోజే ఢిల్లీలో దిగిన అక్బర్.. గంటల వ్యవధిలోనే పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర శర్మకు తన రాజీనామా లేఖను పంపించిన అక్బర్.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది. అక్బర్‌పై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో.. బీజేపీపై విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైంది. దీనిపై విచారణకు ఆదేశిస్తారా?.. అక్బర్‌ను పదవి నుంచి తప్పిస్తారా? అని విపక్ష నేతలు ప్రశ్నించారు.

కానీ బీజేపీ మాత్రం అక్బర్ వ్యవహారంపై వ్యూహాత్మక మౌనం దాల్చింది. అయితే వివాదం అంతకంతకూ పెద్దదవుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో అక్బర్‌పై వేటు వేయడం కాకుండా.. ఆయన్నే మర్యాదపూర్వకంగా తప్పుకోవాలని పార్టీ సూచించిందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి #మీటూ సెగ కేంద్రమంత్రి అక్బర్‌కి గట్టిగానే తగిలిందని చెప్పాలి. ఇప్పటికైతే దీనిపై ఆయన నుంచి నేరుగా ఎటువంటి స్పందన రాలేదు. పదవికి రాజీనామా చేసిన సందర్భంలోనైనా.. ఆయన మీడియాతో మాట్లాడుతారో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి:#MeToo: 'మీ టూ' సుడిగుండంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్

First published: October 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు