
గులాంనబీ ఆజాద్
JammuKashmir Article 370 Revoked : కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఇకనుంచి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది. లడఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370,35ఏని రద్దు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ దీన్ని తీవ్రంగా ఖండించారు.బీజేపీ భారత రాజ్యాంగాన్ని హత్య చేసిందని.. కాశ్మీర్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు.కాశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏయే పార్టీలు వ్యతిరేకిస్తాయి..? ఏయే పార్టీలు స్వాగతిస్తాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. బహుజన్ సమాజ్ పార్టీ,వైసీపీ పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా,కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఇకనుంచి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది. లడఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది.ఇదిలా ఉంటే, దశాబ్దాలకు పైగా రగులుతున్న కాశ్మీర్ సమస్యను ఇలాంటి నిర్ణయం ద్వారా పరిష్కరించాలనుకోవడం సరికాదని విపక్షాలు మండిపడుతున్నాయి. కాశ్మీర్ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 370 రద్దు చేయడం వ్యతిరేకిస్తున్నాయి. మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నాయి.
Published by:Srinivas Mittapalli
First published:August 05, 2019, 12:30 IST