మాజీ క్రికెటర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై పిలుపునిచ్చిన సమావేశానికి హాజరుకానందున ఆయన తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఆదివారం ప్రొదున్నే గౌతమ్ గంభీర్ అదృశ్యం అని పోస్టర్లను వెలిసాయి. ఈ పోస్టర్లో.. "మీరు ఈ వ్యక్తిని చూశారా? చివరిసారిగా ఇండోర్‌లో స్నేహితులతో కలిసి జలేబీ, పోహా తినడం చూశామని.. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతోంది” అని రాసిఉంది.
గంభీర్ గత వారం కొనసాగుతున్న టెస్ట్ మ్యాచ్ కామెంటరీ కోసం ఇండోర్ వచ్చారు. శుక్రవారం.. వివిఎస్ లక్ష్మణ్, జతిన్ సప్రూ, గంభీర్ కలసి సరదాగా.. పోహా, జలేబీలు తీసుకుంటున్న చిత్రాన్ని అయన ట్వీట్ చేశారు. దీని తరువాత, గంభీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆప్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు గంభీర్ ను విమర్శించాయి.
Published by:rajaneedhar Reddy
First published:November 17, 2019, 13:18 IST