• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MISMANAGEMENT OF MODI GOVT RESPONSIBLE FOR THE WORRISOME ECONOMY SAYS MANMOHAN SINGH SB

ఆర్థిక మాంద్యంపై మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఆర్థిక మాంద్యంపై మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

మోడీ, మన్మోహన్ (ఫైల్ ఫొటోలు)

.పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కూడా ప్రభావం చూపొస్తున్నాయన్నారు. అంతర్జాతీయ అవకాశాల్ని కేంద్రం అందిపుచ్చుకోవడం లేదని మన్మోహన్ ఆరోపణలు చేశారు.

  • Share this:
    ఆర్థిక మాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవీ నర్సింహరావు హయాంలో దేశ ఆర్థిక మంత్రిగా కూడా వ్యవహరించిన మన్మోహన్.. ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతకాని తనం వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందన్నారు.పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కూడా ప్రభావం చూపొస్తున్నాయన్నారు. అంతర్జాతీయ అవకాశాల్ని కేంద్రం అందిపుచ్చుకోవడం లేదని మన్మోహన్ ఆరోపణలు చేశారు. భారత్‌ ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశాలున్నా కూడా సరైన ప్రభుత్వ పాలన లేక దేశం కష్టాల్లోకి వెళ్లాపోతుందని ఆవేదన వ్యక్తంచేశారాయన. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రైతులు,  నిర్మాణరంగంలో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మోదీ కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని ఆర్థిక పరిపుష్టిపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేంద్ర  ప్రభుత్వం ఎగుమతుల్ని ప్రోత్సహించడం లేదని మండిపడ్డారు.

    ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం అలజడి రేకిత్తిస్తోంది. కేంద్ర సర్కారు పైకి ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నప్పటికీ దాని ప్రభావం ప్రజాజీవితంపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానిగా నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పెనుసంక్షోభాన్ని చవిచూస్తోంది. అటు కశ్మీర్, ఇటు విదేశీ దౌత్యం, సుస్థిరమైన పాలన, అవినీతి రహిత విధానాలతో దేశప్రజల మద్దతును , విశ్వాసాన్ని ఎన్డీఏ గెలుచుకుంది. అందుకే నాలుగు నెలలక్రితం నాటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో దేశ ప్రజలు ఆపార్టీకి పట్టం గట్టారు. కానీ ప్రజల జీవనప్రమాణాలతో , దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన అంశాల్లో సర్కారు తప్పటడుగులు వేసిందనే భావన బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజకీయాలు, పొలిటికల్ పోలరైజేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టి ఆర్థిక రంగాన్నినిర్లక్ష్యం చేసిందని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు నిపుణుల సైతం వత్తాసు పలుకుతున్నారు.

    Published by:Sulthana Begum Shaik
    First published: