Mirzapur 2: మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలి.. ఎంపీ అనుప్రియ డిమాండ్

కొద్ది రోజుల కిందట విడుదలైన మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలని అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 25, 2020, 3:18 PM IST
Mirzapur 2: మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలి.. ఎంపీ అనుప్రియ డిమాండ్
మీర్జాపూర్ పోస్టర్
  • Share this:
కొద్ది రోజుల కిందట విడుదలైన మీర్జాపూర్ 2(Mirzapur 2) వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలని అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నుంచి ఆమె ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీర్జాపూర్‌ను హింసాత్మక ప్రాంతంగా చూపించారని అనుప్రియ విమర్శించారు. ఇలా చేయడం ద్వారా ఈ ప్రాంతం పేరును దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మీర్జాపూర్ ప్రశాంతతకు, సామరస్యానికి కేంద్రంగా ఉందన్నారు. మీర్జాపూర్ హింసాత్మక ప్రాంతంగా చూపించడంపై విచారణ చేపట్టాలని.. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు అనుప్రియ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ పెట్టారు. ఈ వెబ్ సిరీస్‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కూడా ఆమె కోరారు. ఇక, మొదటి సీజన్‌లో మీర్జాపూర్ వెబ్ సిరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. గ్యాంగ్‌ వార్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా ఈ మొదటి సీజన్‌ను తెరకెక్కించారు. ఇక రెండో సీజన్ మీర్జాపూర్-2లో కుటుంబాల వైరుద్యాలు, రాజకీయాలు, ఎన్నికల చుట్టూ తిరిగే హింసాత్మక కథను చూపించారు.



ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ వెబ్‌ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు దర్శకత్వం వహించారు. ఇందులో అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, రసికా దుగల్, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌, అంజుమ్ శర్మ, షీబా చద్దా కీలక పాత్రల్లో నటించారు.
Published by: Sumanth Kanukula
First published: October 25, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading