2021 ఎన్నికలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు...

తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అద్భుతం జరగబోతోందన్నారదు.

news18-telugu
Updated: November 21, 2019, 4:35 PM IST
2021 ఎన్నికలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు...
కమల్ హాసన్,రజనీకాంత్ (File Photo)
  • Share this:
తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అద్భుతం జరగబోతోందన్నారదు. అయితే, ఆ అద్భుతం ఏంటో మాత్రం ఆయన చెప్పలేదు. కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కలసి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్‌తో తాను కలసి పని చేస్తానని రజినీ ప్రకటించారు. రజినీ తన పార్టీతో కలిసొస్తే బావుంటుందని కమల్ హాసన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. మరోవైపు అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ చేశాయి.

రజినీకాంత్‌కు బీజేపీ అండ ఉందని, సూపర్ స్టార్‌ను కమలం పెద్దలే వెనుక నుంచి నడిపిస్తున్నారంటూ ప్రచారం ఉంది. అయితే, తాను బీజేపీ ట్రాప్‌లో పడబోనని చెప్పారు. తనకు కాషాయరంగు పులిమేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమిళ ప్రజల కోసం తాను పనిచేస్తానని చెప్పారు. ఈ క్రమంలో కమల్ హాసన్‌తో కలసి పనిచేసేందుకు కూడా రజినీకాంత్ సుముఖత వ్యక్తం చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 21, 2019, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading