Municipal Election Result: కుప్పం బీటలు వారాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తనకు అడ్డాగా మార్చుకుని.. 40 ఏళ్ల పాటు తిరుగులేని నేతగా ఎదిగిని నియోజకవర్గాన్ని.. వైసీపీ ఆక్రమించేసింది. అసలు ఇంత కాలం ఎన్నికలే లేకుండా ఏకగ్రీవంగా నెట్టుకొస్తున్న కుప్పం (Kuppam) మున్సిపాలిటిలో పోటీ చేయడం కాదు.. ఏకం ఆ మున్సిపాలిటీనే వైసీపీ సొంతం చేసుకుంది. ఈ విజయం క్రెడిట్ అంతా కచ్చితంగా మంత్రి పెద్ది రెడ్డి (Minster Peddireddy) దే.. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్వయంగా పెద్దిరెడ్డిని పిలిపించి మరీ అభినందించారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర మంతా ఒక ఎత్తైతే.. కుప్పం ఒక ఎత్తు.. అధికార పార్టీగా అన్ని చోట్ల ఈజీగా గెలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ చంద్రబాబు కోటను బద్దల కొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఆ పనిని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు అధినేత జగన్..
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు పెద్ది రెడ్డి.. అంతా తానై కుప్పం ఎన్నికల కు వైసీపీ శ్రేణులను సిద్ధం చేసి.. మున్సిపాలిటీని సొంతం చేసుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ప్రమాదం పొంచి ఉందని ముందే ఊహించిన చంద్రబాబు స్వయంగా కుప్పం వెళ్లి.. ప్రజలను కార్యకర్తలు, నేతలను అందరినీ కలిసి.. పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినా.. పెద్దిరెడ్డి వ్యూహాల ముందు ఆయన అనుభవం నిలబడలేకపోయింది..
తాజా విజయంతో మంత్రి పెద్ది రెడ్డి చంద్రబాబు, లోకేష్ పై పంచ్ లు వేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలు మద్దతు ఉందన్నారు పెద్ది రెడ్డి. దాని ఫలితంగానే ప్రతిపక్ష నేత.. 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధ్యమైంది అన్నారు. కుప్పంలో పంచాయతీ, పరిషత్, మున్సిపోల్స్లోనూ ప్రజలు వైసిపికే పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇంతలా ప్రజలు ఛీ కొట్టినా ఇంకా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడతారని అనుకోవడం లేదన్నారు. అక్కడితోనే ఆగలేదు.. చంద్రబాబు నాయుడికి పలు సూచనలు చేశారు పెద్దిరెడ్డి..
ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు లాక్కున్నారని.. చివరికి ఆ పార్టీని తన అసమర్థతతో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు పార్టీని అప్పగించాలని పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. వరుస ఓటమిలతో కుంగిపోయిన చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ తన ఆరోగ్యం కాపాడుకోవడం మంచిదన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ తన ఓటు ఉన్న నియోజకవర్గంలోనే గెలవలేకపోయారని గుర్తు చేశారు..
ఇదీ చదవండి : ఆ జిల్లాను భయపెడుతున్న వింత జ్వరాలు.. 6 నెలల లోపు చిన్నారులకు అంతు చిక్కని వ్యాధి
కుప్పం ఎన్నికల సందర్భంలో లోకేష్ స్థాయిని మంచి మాట్లాడారని.. ఆయన మాటలకు ప్రజలు రెండు చెంపలు వాయించి, మళ్ళీ మా ఊరుకు రావద్దని తీర్పు ఇచ్చారన్నారు. ఇకపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేయడానికి భయపడతారని.. అందుకే తన నియోజకవర్గం పుంగనూరు నుంచి పోటీ చేస్తానంటే చంద్రబాబును స్వాగతిస్తాను అన్నారు మంత్రి పెద్ది రెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Kuppam, Peddireddy Ramachandra Reddy, TDP