MINSTER AVANTHI SRINIVAS NOT ATTENDING YCP JOINING S POGROM IN OWN CONSTITUTION NGS
Andhra Pradesh: మంత్రి అవంతి అలక..? వైసీపీ జాయినింగ్స్ కు డుమ్మా?
అవంతి శ్రీనివాసరావు అధిష్టానంపై అలిగారా? తనకు ఇష్టలేకుండా గంటా అనుచరుడ్ని పార్టీలో జాయిన్ చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారా? విజయసాయి రెడ్డి మాటలకు అర్థం అదేనా?
అవంతి శ్రీనివాసరావు అధిష్టానంపై అలిగారా? తనకు ఇష్టలేకుండా గంటా అనుచరుడ్ని పార్టీలో జాయిన్ చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారా? విజయసాయి రెడ్డి మాటలకు అర్థం అదేనా?
ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేతల్లో అవంతి శ్రీనివాసరావు ఒక్కరు. ముఖ్యంగా విశాఖకు సంబంధించిన వ్యవహరాల్లో విజయసాయిరెడ్డి నెంబర్ వన్ అయితే.. నెంబర్ టు అవంతి శ్రీనివాసరావు అన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్న అక్కడ కచ్చితంగా అవంతి ఉంటారు. ఆయన లేని కార్యక్రమం ఉండదు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమంలోనూ విజయసాయి రెడ్డి వెంటే నడిచారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారాల్లో విజయసాయి రెడ్డితో పాటు పాల్గొన్నారు. ఇద్దరూ బుల్లెట్లపై సైతం ప్రచారం నిర్వహించారు. ఇలా ఎక్కడ విజయసాయిరెడ్డి ఉంటే అక్కడ అవంతి కూడా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీకి భారీగా జాయినింగ్ లు అయ్యాయి. అప్పుడు అవంతి దగ్గర ఉండి అందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు కూడా.. కానీ విశాఖలో తన సొంత నియోజకవర్గంలో వైసీపీ చేరికల కార్యక్రమంలో అవంతి పాల్గొనకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు ఎప్పటినుంచో వైసీపీలోకి చేరుతారనే ప్రచారం ఉంది. ఆయన పదే పదే ఖండిస్తున్నా. ప్రచారం మాత్రం ఆగడం లేదు. అయితే గంటా చేరికను అవంతి అడ్డుకుంటున్నారనేది అందరికీ తెలిసిందే. బహిరంగంగానే గంటాపై ఆయన విరుచుకుపడుతుంటారు. ఒకప్పుడు ఇద్దరూ మంచి మిత్రులే అయినా.. 2019 ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. భీమిలీ సీటు విషయంలో వచ్చిన వివాదం ఇద్దరిని ఉప్పు నిప్పుగా మార్చింది. దీంతో అవంతి వైసీపీలో జాయిన్ అయ్యి.. భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొంది.. మంత్రి కూడా అయ్యారు. గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నుంచి గెలుపొందారు.. కానీ టీడీపీ కార్యక్రమాలకు అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నారు.
అయితే గంటా వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా అవంతినే అడ్డుపడుతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ జాయినింగ్ కూడా అవంతికి ఇష్టం లేనట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే కాశీ చేరిక కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు కానీ మంత్రి అవంతి హాజరుకాలేదు. దీంతో వైసేపీ శ్రేణుల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు కాశీ విశ్వనాథ్ జాయినింగ్ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల నిర్ణయం ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అంటే దానర్ధం అవంతికి ఇష్టం లేకుండానే విశ్వనాథ్ ను వైసీపీ అధిష్టానం పార్టీలో చేర్చుకుందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.